కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki, దేశీయ కార్ మార్కెట్లోని అనేక విభాగాల్లో కార్లను విక్రయిస్తోంది. మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో కంపెనీ విక్రయిస్తున్న Maruti Suzuki Ciaz (మారుతి సుజుకి సియాజ్), ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఉంది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

ఈ విభాగంలో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేస్తున్న Maruti Suzuki Ciaz, అమ్మకాల పరంగా మరో కొత్త మైలురాయిని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటి వరకూ 3 లక్షల యూనిట్లకు పైగా సియాజ్ కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

భారతదేశంలో సెడాన్ అమ్మకాలు తగ్గుతున్న సమయంలో ఈ కారు మిడ్-సైజ్ సెడాన్ విభాగంలోకి ప్రవేశించిందని, ఇప్పుడు ఈ మోడల్ 3 లక్షల మందికి పైగా కస్టమర్లకు చేరువ అయ్యిందని, ఇది కంపెనీకి ఓ పెద్ద విజయం అని Maruti Suzuki India ప్రకటించింది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

Maruti Suzuki India తమ మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ Maruti Ciaz ను తొలిసారిగా 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కారు BS6 ఉద్గార నిబంధలకు లోబడి అప్‌గ్రేడ్ చేయబడింది మరియు ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది. గతంలో ఇందులో డీజిల్ వెర్షన్ కూడా లభించేది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

మార్కెట్లో Maruti Suzuki Ciaz ను కంపెనీ రూ. 8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. కాగా, ఇందులో టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 11.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. విశాలమైన క్యాబిన్, అధిక బూట్ స్పేస్, కంఫర్టబల్ ఇంటీరియర్స్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఈ కారులోని ప్రధాన ప్రత్యేకతలు.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

ఇంజన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి సియాజ్ కారులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపోయగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి పవర్ ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఇందులై మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

Maruti Suzuki India నుండి లభిస్తున్న Ciaz మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని ఈ విభాగంలో Honda City (హోండా సిటీ) మరియు Hyundai Verna (హ్యుందాయ్ వెర్నా) వంటి కార్లతో పోటీపడుతుంది. ఈ రెండు మోడళ్లకు ప్రత్యామ్నాయంగా మరియు సరసమైన ధరకే Ciaz అందుబాటులో ఉంటుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

అమ్మకాల పరంగా సియాజ్ సాధించిన ఈ విజయం గురించి Maruti Suzuki India Pvt Ltd సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) Shashank Srivastava (శశాంక్ శ్రీవాస్తవ) మాట్లాడుతూ.. "ఇది (సియాజ్) 3 లక్షల అమ్మకాల మైలురాయి చేరుకోవటం అనేది కంపెనీపై కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిభింభింపజేస్తుంద"ని అన్నారు.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త తరం Maruti Suzuki Ciaz ను కంపెనీ 2018 సంవత్సరంలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో ప్రవేశపెట్టింది. సింపుల్ గా కనిపిస్తూనే ప్రీమియం డిజైన్ ను కలిగి ఉండటం ఈ కారు ప్రత్యేకత. ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ ఫినిషింగ్స్, సొగసైన బంపర్స్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను గమనించవచ్చు.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

మారుతి సుజుకి సియాజ్ ప్రీమియం లుక్ ని మరింత పెంచేందుకు కారులో చాలా చోట్ల క్రోమ్ గార్నిష్‌ కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్, లోపలి డోర్ హ్యాండిల్స్, ఏసి వెంట్స్, గేర్ నాబ్ మరియు పార్కింగ్ బ్రేక్ లివర్ వంటి అంశాలపై క్రోమ్ గార్నిష్ ని చూడవచ్చు. డ్రైవర్ సమాచారం కోసం దీని ఇంటీరియర్ లో 4.2 TFT మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే (MID) కూడా ఉంటుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

అంతేకాకుండా, వెనుక ప్రయాణికుల సౌకర్యం కోసం రియర్ ఏసి వెంట్స్ ఈ కారులో స్టాండర్డ్ ఫీచర్ గా లభిస్తుంది. ముందు మరియు వెనుక సీటులో సెంటర్ ఆర్మ్‌రెస్ట్ లు కూడా ఉంటాయి. ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ క్రింది భాగంలో స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉండగా, వెనుక సీట్ ఆర్మ్‌రెస్ట్‌లో కప్ హోల్డర్స్ ఉంటాయి.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

Maruti Suzuki Ciaz కారులో కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVM) వంటి అనేక కంఫర్ట్ ఫీచర్లు కూడా లభిస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త మైలురాయిని చేరుకున్న Maruti Suzuki Ciaz; కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్..

రీకాల్ చేసిన కార్లలో Maruti Suzuki Ciaz

Maruti Suzuki ఇటీవల ప్రకటించిన 1.80 లక్షల కార్ల రీకాల్ లో కొన్ని సియాజ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ కార్లలోని మోటార్ జనరేటర్ యూనిట్‌ లో ఉన్న లోపాన్ని చెక్ చేసేందుకు కంపెనీ ఈ రీకాల్ ను ప్రకటించింది. మే 04, 2018 నుంచి 2020 అక్టోబర్ 27 మధ్యలో తయారైన పెట్రోల్ కార్లను కంపెనీ రీకాల్ చేసింది. - ఈ రీకాల్‌కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti suzuki ciaz sales crossed 3 lakh units reached new milestone details
Story first published: Friday, September 10, 2021, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X