భారీగా పెరిగిన Maruti Eeco ధర.. ఏకంగా రూ. 8,000 పెంపు

మారుతి సుజుకి (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ యొక్క దాదాపు అన్ని వాహనాలు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇందులో ఒకటి మారుతి ఎకో (Maruti Eeco). ఒకప్పటి నుంచి కూడా ఎక్కువమంది ఇష్టపడే ఎమ్‌పివిలలో మారుతి ఎకో ఒకటి. అయితే కంపెనీ ఈ ఎమ్‌పివి ధరను ఒక్క సరిగా రూ. 8,000 పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

మారుతి ఎకో ఎమ్‌పివి కేవలం ప్రయాణాలకు మాత్రమే కాకుండా చాలా అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. దీనిని మల్టీ పర్పస్ వెహికల్ గా భారతీయ మార్కెట్లో వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన ఈ ధరలు 2021 నవంబర్ 30 నుంచి అందుబటులో ఉంటాయి.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

కంపెనీ ధరలను పెంచిన తరువాత, మారుతి ఎకో యొక్క ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4.3 లక్షల నుండి రూ. 5.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇందులో అంబులెన్స్ వేరియంట్ రూ. 7.29 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

మారుతి ఎకో పెట్రోల్ మరియు CNG ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. అయితే ఇందులోని కార్గో వేరియంట్ 2015 లో ప్రవేశపెట్టబడింది. కంపెనీ ఈ వేరియంట్ ని ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరం కాలంలో ఏకంగా 1 లక్ష యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే 2018 నాటికి కంపెనీ 5 లక్షల యూనిట్లను విక్రయించింది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

మారుతి ఎకో ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 72 బిహెచ్‌పి పవర్ మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఇందులోని సిఎన్‌జి ఇంజన్ 46 బిహెచ్‌పి పవర్ మరియు 85 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

మారుతి సుజుకి ఎకో కార్గో మొత్తం అమ్మకాలలో CNG వేరియంట్ వాటా మొత్తం 17 శాతం. మారుతి సుజుకి ఎకో నాన్-కార్గో వేరియంట్‌లు ప్రామాణికంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌ని పొందుతాయి. ఇఇ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా వాహనదారుల భద్రతను కూడా నిర్థారిస్తాయి.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

ఇదిలా ఉండగా భారతీయ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకి గత కొంత కాలంగా సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటోంది. సెమీకండక్టర్ల కొరత కారణంగా కంపెనీ అక్టోబర్ మరియు నవంబర్ ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, ఈ పరిస్థితి ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కావున ఈ పరిస్థితి ఈ నెలలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఉత్పత్తి మరియు విక్రయాలపైన కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

కంపెనీ అందించిన సమాచారం, మారుతీ సుజుకీ తన హర్యానా మరియు గుజరాత్ ప్లాంట్లలో ఉత్పత్తిని ఈ డిసెంబర్‌లో 80 నుంచి 85 శాతం ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశంలో ప్యాసింజర్ వాహనాల డిమాండ్ తిరిగి పుంజుకుంటున్నప్పటికీ, సెమీకండక్టర్ కొరత కారణంగా తగినంత ఉత్పత్తి మరియు సరఫరా చేయలేకపోతోంది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

సెమీకండక్టర్ చిప్ కొరత ప్రస్తుతం పరిష్కరించడానికి కొంత కష్టమనే చెప్పాలి. చిప్ కొరత కారణంగా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని, అందుకే డెలివరీ గడువును పొడిగించాల్సి ఉంటుందని మారుతీ సుజుకీ గతంలో పేర్కొంది. అదే సమయంలో, కస్టమర్ల నిరీక్షణ ఎక్కువ కాలం ఉండకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని కంపెనీ తెలిపింది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

గ్లోబల్ చిప్ కొరత 2022 లో ఏడాది పొడవునా కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్-19 వైరస్ యొక్క కొత్త వెర్షన్ భారతదేశంలో పడితే, అది ఆటోమోటివ్ రంగానికి మరో ఇబ్బందిని తెస్తుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో 40 శాతం, అక్టోబర్‌లో 60 శాతం, నవంబర్‌లో 85 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని మారుతీ సాధించింది. ఇందులో భాగంగానే మారుతి సుజుకి ఇకపైన డీజిల్ కార్లను అందించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.

మారుతి సుజకి కంపెనీ భారతీయ మార్కెట్లో బిఎస్ VI ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే, అంటే 2019 లోనే డీజిల్ ఇంజిన్ మోడల్‌ల తయారీని నిలిపివేసింది. ప్రస్తుతం ఉన్న ఉద్గార నిబంధనల ప్రకారం డీజిల్ ఇంజన్ల తయారీ ఆచరణ సాధ్యం కాదని కంపెనీ పేర్కొంది. ఈ కారణంగా డీజిల్ కార్ల ఉత్పత్తి నిలిపివేసింది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

భారతీయ మార్కెట్లో రోజురోజుకి డీజిల్ ఇంజన్ కార్ల డిమాండ్ భారీగా తగ్గిపోతోంది. ఈ కారణంగా డీజిల్ మోడల్స్ ఎక్కువ అమ్ముడుపోవడం లేదు, ఈ కారణంగా కంపెనీకి డీజిల్ కార్ల వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ డీజిల్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసింది. పెట్రోల్ వాహనాల తయారీకంటే కూడా డీజిల్ వాహనాల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. కావున కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Maruti Eeco ఇప్పుడు మరింత కాస్ట్లీ గురూ..!!

మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా తమ CNG కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. 2023 లో కొత్త దశ ఉద్గార ప్రమాణాలు వస్తాయి, ఇది ఖర్చులను పెంచే అవకాశం ఉంది. మారుతీ సుజుకి ప్రస్తుతం ఈ విభాగంలో 85 శాతానికి పైగా మార్కెట్ వాటాతో దేశంలో CNG కార్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో విక్రయించిన 1.9 లక్షల యూనిట్ల CNG వాహనాల్లో 1.6 లక్షలకు పైగా CNG కార్లను మారుతీ సుజుకీ విక్రయించింది.

Most Read Articles

English summary
Maruti suzuki eeco price increased by rs 8000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X