Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎర్టిగా (Ertiga) మరియు ఎక్స్ఎల్6 (XL6) ఎమ్‌పివిలకు డిమాండ్ ఊపందుకుంది. వీటిలో మారుతి ఎర్టిగా చాలా కాలం నుండి మార్కెట్లో ఉండగా, ఎర్టిగా ను ఆధారంగా చేసుకొని రూపొందించిన ప్రీమియం 6-సీటర్ ఎమ్‌పివి ఎక్స్ఎల్6 ను 2019లో మార్కెట్లో విడుదల చేశారు.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

ప్రస్తుతం, మారుతి సుజుకి ఈ రెండు ఎమ్‌పివి లతో ఈవిభాగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ప్రత్యేకించి, ఎక్స్ఎల్6 మోడల్ ను పరిచయం చేసిన తర్వాత, ఇది మారుతి సుజుకి సంస్థకు ఎమ్‌పివి సెగ్మెంట్‌లో అత్యుత్తమ మార్కెట్ వాటాను సాధించడంలో సహాయపడిందని చెప్పాలి. తాజా నివేదిక ప్రకారం, మారుతి సుజుకి ఇండియా గడచిన అక్టోబర్ 2021 నెలలో ఈ రెండు మోడళ్లను (ఎర్టిగా, ఎక్స్ఎల్6) కలిపి 17,000 యూనిట్లకు పైగా విక్రయాలను నమోదు చేసింది.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

మారుతి సుజుకి గత నెలలో మొత్తం 17,525 యూనిట్ల ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఎమ్‌పివి లను విక్రయించింది. వీటిలో 12,923 యూనిట్లు ఎర్టిగా ఎమ్‌పివిలు కాగా, 4,602 యూనిట్లు ఎక్స్‌ఎల్6 ఎమ్‌పివిలు ఉన్నాయి. ఈ రెండు ఎమ్‌పివిలు కూడా భారత ఎమ్‌పివి సెగ్మెంట్‌లో ఆధిపత్యాన్ని చెలాయించడమే కాకుండా, విభాగంలో అగ్రగామిగా మారుతి సుజుకి తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో కూడా సహాయపడ్డాయి.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

మారుతి సుజుకి ఎర్టిగా మరియు మారుతి సుజుకి ఎక్స్ఎల్6 రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫామ్ పై రూపొందించబడ్డాయి. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్ మరియు ఫీచర్లు ఉంటాయి. బిఎస్6 అప్‌డేట్ తర్వాత మారుతి సుజుకి పూర్తిగా డీజిల్ కార్లను నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ రెండు ఎమ్‌పివిలు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తున్నాయి. మరి భవిష్యత్తులో కంపెనీ వీటిలో డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ప్రవేశపెడుతుందో లేదో చూడాలి.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, ఈ రెండు కార్లలో ఒకే రకమైన 1.5 లీటర్ 4-సిలిండర్ సహజంగా ఆశించిన (న్యాచురల్లీ ఆస్పిరేటెడ్) పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి పవర్ మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ విషయానికి వస్తే, ఇవి రెండూ కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ లేదా ఆప్షనల్ 4 స్పీడ్ ఆటోమేటిక్‌తో ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఈ రెండు మోడళ్లు ఈ విభాగంలో తమ పోటీదారులతో పోటీ పడేందుకు అనేక ఫీచర్లతో లభిస్తాయి.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

ఈ ఎమ్‌పివిల ముందు భాగంలో క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన పెద్ద గ్రిల్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్లోపింగ్ రూఫ్ మరియు 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మారుతి ఎర్టిగా వెనుక భాగంలో ఎల్-ఆకారపు టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ రెండు కార్లలో Android Auto మరియు Apple CarPlay కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్ కోసం మాన్యువల్ సీట్ ఎత్తు సర్దుబాటు, క్రూయిజ్ కంట్రోల్, వెనుక సీటులోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలు ఎక్స్టీరియర్ డిజైన్ పరంగానే కాకుండా, ఇంటీరియర్లలో కూడా స్వల్ప వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. మారుతి సుజుకి ఎర్టిగా ఒక 7-సీటర్ ఎమ్‌పివి, ఇందులో రెండవ వరుసలో బెంచ్ టైప్ సీట్ ఉండి, ముగ్గురు ప్రయాణీకులు కూర్చోవడానికి అనుమతిస్తుంది. కాగా, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఒక 6-సీటర్ ఎమ్‌పివి, ఇందులో రెండవ వరుసలో బెంచ్ టైప్ సీట్ ఉండదు. దానికి బదులుగా రెండు వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉంటాయి, వీటిలో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

అంతేకాకుండా, ఎర్టిగా ఎమ్‌పివి డ్యూయల్-టోన్ థీమ్‌ క్యాబిన్ ను కలిగి ఉంటే, ఎక్స్ఎల్6 ఎమ్‌పివి పూర్తి బ్లాక్ కలర్ క్యాబిన్ లేఅవుట్‌ను పొందుతుంది. అయితే, సేఫ్టీ విషయంలో మాత్రం ఈ రెండు మోడళ్లు ఏమాత్రం వెనుకబడి లేవు. ఈ కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

ఇక ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా ధరలు రూ. 7.96 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్ ఎండ్ ఆటో ట్రిమ్ ధర రూ. 10.69 లక్షలుగా ఉంటుంది. అలాగే, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ధరల విషయానికి వస్తే, ఈ ప్రీమియం ఎమ్‌పివి రూ. 9.98 లక్షల నుండి రూ. 11.86 లక్షల మధ్యలో అందుబాటులో ఉంటుంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Ertiga మరియు XL6 ఎమ్‌పివిలకు భారీగా పెరిగిన డిమాండ్.. ఒక్క నెలలోనే 17,000 యూనిట్లకి పైగా సేల్స్

మారుతి ఎర్టిగా ధరతో పోలిస్తే, ఎక్స్ఎల్6 ధర కాస్తంత అధికంగా ఉన్నప్పటికీ, కంపెనీ ఈ ఎమ్‌పివిలో ధరకు తగిన ఫీచర్లను అందిస్తోంది. మారుతి ఎక్స్ఎల్6 చూడటానికి ఎర్టిగా ఎమ్‌పివి కన్నా ప్రీమియంగా మరియు బల్కీగా కనిపిస్తుంది. ఈ రెండు మారుతి సుజుకి ఎమ్‌పివిలు కూడా ఈ విభాగంలో మహీంద్రా మారాజో మరియు టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.

Most Read Articles

English summary
Maruti suzuki ertiga and xl6 mpv s sold over 17000 units in october 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X