కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక మరియు సంపూర్ణ లాక్‌డౌన్‌లు కొనసాగుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ సర్వీస్ సెంటర్లను మరియు డీలర్‌షిప్‌లను పూర్తిగా మూసివేయటం లేదా కొన్ని గంటల పాటు మాత్రమే నిర్వహించడం చేస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ కొత్త వాహనాల విషయంలో ఉచిత సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

మారుతి సుజుకి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో, వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుతి ఉచిత సేవ, వారంటీ మరియు ఎక్స్‌టెండెడ్ వారంటీల కాల వ్యవధిని పొడగించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, మార్చి 15 నుండి మే 31 మధ్య కాలానికి ముగిసే ఉచిత సేవ మరియు వారంటీలను జూన్ 30 వరకూ పొడగించారు.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

ఈ విషయంపై మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, "వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉచిత సేవ, వారంటీ మరియు ఎక్స్‌టెండెడ్ వారంటీని జూన్ 30, 2021 వరకు విస్తరించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇవి మార్చి 15 మరియు మే 31 మధ్యలో ముగిసే వాహనాలకు చెల్లుతుంది" అని వివరించారు.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

"ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లోని కస్టమర్లు ఎక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ పొడిగింపు వారికి ఉపశమనం కలిగించబోతోంది. లాక్‌డౌన్ నుండి మినహాయింపు పొందినప్పుడల్లా, వారు ఈ సేవలను పొందవచ్చు" అని ఆయన అన్నారు. మారుతి సుజుకి తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్రాండ్ వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, మారుతి సుజుకి ఇండియా తమ ప్లాంట్లను మే 16 వరకు మూసివేస్తామని ఇటీవల ప్రకటించింది. హర్యానాలోని రెండు ప్లాంట్లను మరియు గుజరాత్‌లోని ఓ ప్లాంట్ మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

అంతేకాకుండా, ఈ ప్లాంట్ల షట్‌డౌన్ సమయంలో మారుతి సుజుకి వైద్య అవసరాల కోసం ఉపయోగించే ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. కంపెనీ తమ ప్లాంట్‌లలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి అవసరమయ్యే ఆక్సిజన్‌ను అందించి ప్రభుత్వానికి మద్దతుగా నిలువనుంది.

కరోనా ఎఫెక్ట్: మారుతి సుజుకి ఉచిత సర్వీస్, వారంటీ పొడగింపు

సాధారణంగా కార్ల తయారీ ప్రక్రియలో భాగంగా, మారుతి సుజుకి తన కర్మాగారాల్లో తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకొని కంపెనీ తమ ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.

More from DriveSpark

Article Published On: Thursday, May 13, 2021, 10:31 [IST]
English summary
Maruti Suzuki Free Service And Warranty Period Extended Till 30th June, 2021. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+