కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అందిస్తున్న సరికొత్త కార్లను కొనుగోలు చేయకుండానే, వాటిని ఉపయోగించాలని అనుకుంటున్నారా? అయితే, ఈ గుడ్ న్యూస్ మీకోసమే.

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

కొత్త వాహనాల విషయంలో లాంగ్ టెర్మ్ కమిట్‌మెంట్ లేకుండా, కొంత కాలం వరకూ వాటిని ఉపయోగించి ఆ తర్వాత మరో కొత్త కారును నడపాలనుకునే వారి కోసం మారుతి సుజుకి ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే సబ్‌స్క్రిప్షన్ (చందా) ప్లాన్.

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్‌ఎల్6 వంటి ప్రీమియం కార్లను అందిస్తోంది. కాగా, ఈ ప్లాన్‌లో కొత్తగా ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు వ్యాగన్ఆర్ వంటి అదనపు మోడళ్లను జోడించినట్లు కంపెనీ ప్రకటించింది.

MOST READ:బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

మారుతి సుజుకి అందిస్తున్న ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో కారును నేరుగా కంపెనీ నుండి కొనుగోలు చేయకుండా, కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది కారును దీర్ఘకాలం పాటు లీజుకు తీసుకోవటం లాంటిదే అన్నమాట.

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం ద్వారా కారును లీజుకు తీసుకోవటం వలన కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇందులో ఫుల్ కార్ మెయింటినెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి.

MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

ఈ నెలవారీ చందా ప్లాన్ ద్వారా కారును లీజుకు తీసుకునే కస్టమర్లు రీసేల్ గురించి చింతించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవన్నీ మారుతి సుజుకి చూసుకుంటుంది.

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

మారుతి సుజుకి తమ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో కొత్తగా చేర్చిన ఈ చిన్న కార్ల లీజింగ్ వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో 48 నెలలకు గాను వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్‌ను లీజుకు తీసుకుంటే నెలకు అన్ని పన్నులతో కలిపి రూ.12,722 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ అయితే, నెలకు రూ.13,772 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

మారుతి సుజుకి ఇండియా ఈ సబ్‌స్క్రయిబ్ పథకాన్ని న్యూఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై మరియు అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అందిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ పథకాన్ని దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

కస్టమర్లు ఎంచుకునే సమయాన్ని బట్టి, 24, 36, మరియు 48 నెలల కాలపరిమితితో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. చందా కాలపరిమితి పూర్తయిన తర్వాత, కస్టమర్లు కావాలనుకుంటే దానిని పొడిగించడం లేదాన్ని వాహనాన్ని అప్‌గ్రేడ్ చేసుకొని వేరకొ మారుతి సుజుకి వాహనాన్ని పొందడం చేయవచ్చు.

MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

కొత్త మారుతి సుజుకి కార్లను కొనకుండానే ఉపయోగించాలనుకుంటున్నారా?

అలాకాకుండా, కస్టమర్లు అదే కారును ఎప్పటికీ సొంతం చేసుకోవాలనుకుంటే మార్కెట్ ధర వద్ద దానిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది. మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లు మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ చందా ఆధారిత స్కీమ్‌ను అందిస్తోంది.

Most Read Articles

English summary
Now Maruti Suzuki India Adds Small Cars To Its Subscription Plan. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X