జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, గడచిన జులై నెల అమ్మకాల జాబితాను విడుదల చేసింది. జూలై 2020 అమ్మకాలతో పోల్చుకుంటే, జులై 2021 నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 50 శాతం మేర వృద్ధిని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

మారుతి సుజుకి గడచిన జూలై 2021 లో మొత్తం 1,62,462 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. ఇందులో 1,36,500 యూనిట్లు భారతదేశంలో విక్రయించగా, కంపెనీ ఓఈఎమ్ పంపిణీలో భాగంగా 4,738 యూనిట్లను విక్రయించింది. మిగిలిన 21,224 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

జూన్ 2020లో మారుతి సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 1,08,064 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సమయంతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 50.33 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. గత నెలలో దేశీయ అమ్మకాలు 39 శాతం పెరిగి 1,41,238 యూనిట్లుగా నమోదయ్యాయి. జులై 2020 లో ఇవి 1,01,307 యూనిట్లుగా ఉన్నాయి.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ మోడల్స్ అయిన ఆల్టో మరియు ఎస్ - ప్రెసో 17,258 యూనిట్ల నుండి 19,685 యూనిట్లకు పెరిగాయి. అలాగే, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ మరియు టూర్ ఎస్ వంటి చిన్న కార్ల అమ్మకాలు 51,529 యూనిట్ల నుండి 70,268 యూనిట్లకు పెరిగాయి.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

మినీ మరియు కాంపాక్ట్ విభాగాలు కలిసి గత నెలలో మొత్తం 90,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. ఈ సమయంలో సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ అమ్మకాలు కూడా 1,303 యూనిట్ల నుండి 1,450 యూనిట్లకు పెరిగాయి.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

ఇకపోతే, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, విటారా బ్రెజా మరియు ఎస్-క్రాస్‌లను వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు 19,177 యూనిట్ల నుండి 32,272 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో సూపర్ క్యారీ ఎల్‌సివి అమ్మకాలు 2,768 యూనిట్లుగా నమోదయ్యాయి.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తమ రెండవ తరం సెలెరియో కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కారు మార్కెట్లోకి రానుంది. కొత్త సెలెరియో ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా ఉండబోతోంది. మునుపటితో పోలిస్తే, ఈ మోడల్‌లో భారీ డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నట్లు సమాచారం.

జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్

టాప్-ఎండ్ వేరియంట్ సెలెరియో కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన సుజుకి స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంజన్ విషయంలో కూడా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. మాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో 1.0-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్‌లను ఇందులో ఉపయోగించనున్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
Maruti Suzuki India Reports 50 Percent Growth In July 2021 Sales. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X