అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్, కానీ ఇప్పుడదే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్ కంపెనీలను కుదేలు చేస్తోంది. గత కొంత కాలంగా ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌ను వేధిస్తున్న సెమీకండక్టర్ చిప్స్ కొరత, ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

ఈ సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, తమ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించనుంది. ఆగస్టు 2021 నెలలో మారుతి సుజుకి తమ కార్ల ఉత్పత్తిని భారీగా తగ్గించవచ్చని సమాచారం.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

మారుతి సుజుకి ఈ ఆగష్టులో తమ వాహనాల ఉత్పత్తిలో 30 నుండి 40 శాతం వరకు భారీ కోత విధించే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. దీని కారణంగా, మారుతి సుజుకి కార్ల డెలివరీలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిన సెమీకండక్టర్ కొరతే, మారుతి సుజుకి ఉత్పత్తి తగ్గింపుకు కూడా ప్రధాన కారణం.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, ఈ ఆగస్ట్ నెలలో 50,000-60,000 యూనిట్ల తక్కువ కార్లను ఉత్పత్తి చేయబోతోంది. ఈ కారణంగా కంపెనీ ఆదాయాలు రూ.2,500 కోట్ల నుండి రూ.3,000 కోట్లకు తగ్గవచ్చని అంచనా. మరోవైపు, రానున్న పండుగ సీజన్‌లో ప్రముఖ మారుతి సుజుకి మోడళ్ల లభ్యత కూడా తగ్గే అవకాశం ఉంది.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

కోవిడ్-19 వ్యాప్తి తర్వాత, ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో కార్లకు మునుపటి కన్నా ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు కార్లను ఎక్కువ కొనడమే ఇందుకు కారణం. ఈ సంవత్సరం మొత్తం ఉత్పత్తిలో 5 శాతం తగ్గింపు, అంటే 70,000-80,000 యూనిట్లు ఉండవచ్చని సుజుకి మోటార్స్ అంచనా వేసింది. కానీ, ఆగస్టు నెలలో మాత్రమే ఇది మూడు వంతులు తగ్గే అవకాశం ఉంది.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

ఈ నెలలో సుమారు 1,10,000 యూనిట్ల 1,20,000 యూనిట్ల వరకు వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ఆగస్టులో 45,000 యూనిట్లకు చేరుకుంటుందని కంపెనీ అంచనా వేసింది. సాధారణంగా, ఈ ప్లాంట్‌లో ప్రతి నెలా సగటున 65,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

గడచిన జూలై 2021 నెలలో మారుతి సుజుకి 1,70,719 యూనిట్ల వాహనాలను మరియు జూన్ 2021 నెలలో 1,65,576 యూనిట్ల వాహనాలను తయారు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కంపెనీ మొత్తం ఉత్పత్తి 5,37,174 యూనిట్లకు చేరుకుంది. ఈటి ఆటో ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 1,50,000 యూనిట్ల తక్కువ వాహనాలు ఉత్పత్తి చేయవచ్చని అంచనా.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

సాధారణంగా, ప్రతి పండుగ సీజన్‌లో కార్ డీలర్లు తమ వద్ద ఎక్కువ కార్లను స్టాక్ ఉంచుకుంటారు. కానీ, ఈ ఏడాది పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉంది. స్టాక్ లభ్యత లేకపోవటం, అధిక వెయిటింగ్ పీరియడ్‌ల కారణంగా డీలర్లు కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

మారుతి సుజుకి గడచిన జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పుడు తాము 1,70,000 ఆర్డర్‌లను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కాబట్టి, రాబోయే నెలల్లో అమ్మకాలు భారీగానే ఉంటాయని అంచనా. అయితే, వాహనాల ఉత్పత్తి తగ్గింపు కారణంగా, ఇవన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

మరోవైపు పెరుగుతున్న కార్ల ధరలు కూడా వాటి అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే అనేక కార్ కంపెనీలు తమ కార్ల ధరలను మూడు రెట్లు పెంచాయి. పెరుగుతున్న ముడి సరుకులు, రవాణే ఖర్చులే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, దేశంలో మారుతి సుజుకితో సహా ఇతర ఆటోమొబైల్ కంపెనీల ఆదాయాలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సెమీకండక్టర్ చిప్స్ సమస్య ఇప్పట్లో ముగిసిపోదని భావిస్తున్నారు.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ చిప్స్ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కార్ల తయారీలో సెమీకండక్టర్ చిప్స్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. మోడ్రన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఈసియూ (ఇంజన్ కంట్రోల్ యూనిట్), డ్రైవర్ అసిస్టెడ్ ఫీచర్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌లో ఈ సెమీకండక్టర్ చిప్‌లను ఉపయోగిస్తుంటారు.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

అంతేకాకుండా, కొత్తగా వస్తున్న అధునాత కార్లలో ఆఫర్ చేసే బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్ మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఫీచర్ల అభివృద్ధిలో ఈ సెమీకండక్టర్ చిప్స్ ఎంతో అవసరం. ఫలితంగా, వీటికి డిమాండ్ తయారీకి మించి ఎక్కువగా ఉంటోంది.

అదొక చిన్న ఎలక్ట్రానిక్ చిప్.. కానీ, ఇప్పుడదే కార్ కంపెనీలను శాసిస్తోంది..

ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారు తయారీలో అవసరమైన ఇలాంటి ముఖ్యమైన భాగాలను తయారు చేయలేరు మరియు వాటిని అమర్చలేరు. ఫలితంగా, కార్ల ఉత్పత్తి కూడా అసాధ్యంగా మారుతుంది. ఈ సమస్య వలన మారుతి సుజుకి మరికొంత కాలం పాటు తమ వాహనాల ఉత్పత్తిలో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కునే అవకాశం ఉంది.

Source: ETAuto

Most Read Articles

English summary
Maruti suzuki india to reduce car production due to semiconductor chips shortage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X