హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, దేశంలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించి హర్యానాలో మరొక కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

హర్యానాలో మారుతి సుజుకి కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌లో కంపెనీ ఏటా 10 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, ఈ ప్లాంట్ 1,000 ఎకరాలలో విస్తీర్ణంలో ఉంటుంది, ఇది గుర్గావ్‌లోని కంపెనీ పాత ప్లాంటును రీప్లేస్ చేస్తుంది.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

గతేడాది నుండి భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా, కొత్త ప్లాంట్ ప్లాన్ పనులు ప్రారంభించడంలో ఆలస్యం జరిగిందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు. ఈ ప్లాంట్ కోసం కంపెనీ సుమారు 17,000-18,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్లాన్ చేసిందని, త్వరలో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించి, గుర్గావ్‌ నుంచి కొత్త ప్లాంట్‌కు ఉత్పత్తిని మారుస్తామని ఆయన తెలిపారు.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

హర్యానా ప్రభుత్వ ఉపాధి విధానం ప్రకారం, ప్రైవేట్ సంస్థలలో 75 శాతం ఉద్యోగాలను స్థానిక ప్రజల కోసం కేటాయించడం తప్పనిసరి చేయబడిందని, ఈ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి, అవి ఇంకా పరిష్కరించబడలేదని భార్గవ చెప్పారు. ఈ విషయంలో తమ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే సంతృప్తికరమైన నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నామని అన్నారు.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

హర్యానా ప్రభుత్వ ఉపాధి విధానం ప్రకారం, ప్రైవేటు కంపెనీలు 50,000 కంటే తక్కువ వేతనంతో కూడిన పోస్టులపై స్థానిక ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉపాధి విధానాన్ని పునఃపరిశీలించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) హర్యానాను డిమాండ్ చేసింది.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియాకు గుర్గావ్‌లో 300 ఎకరాల్లో ఓ ప్లాంట్ ఉంది. అయితే, ఈ ప్లాంట్‌లో స్థలం కొరత కారణంగా దానిని హర్యానాకు మార్చాలని కంపెనీ నిర్ణయించింది. గుర్గావ్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నందున, ప్రస్తుతం ఉన్న ప్లాంట్ నగరం నడిబొడ్డున వచ్చిందని కంపెనీ తెలిపింది.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

ఈ పరిణామాల వలన ముడి పదార్థాల తరలింపు మరియు తుది ఉత్పత్తులను ట్రక్కుల ద్వారా ప్లాంట్ నుండి రవాణా చేయడంలో చాలా ఇబ్బందిగా మారినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్లో ట్రక్కుల కదలిక కారణంగా స్థానిక ప్రజలు కూడా తరచుగా సమస్యలను ఎదుర్కొంటారు.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

గుర్గావ్‌లోని ఈ ప్లాంట్ 1983 నుండి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ ప్లాంట్ నుండే మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది మరియు దాని మొదటి మోడల్ మారుతి 800 ను మనకు పరిచయం చేసింది ఈ ప్లాంట్ ద్వారానే. అంతటి చరిత్ర కలిగిన ఈ ప్లాంట్, స్థలం కొరత కారణంగా, వేరే ప్రాంతానికి తరలిపోనుంది.

హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనున్న మారుతి సుజుకి

ప్రస్తుతం, మారుతి సుజుకి యొక్క గుర్గావ్‌ ప్లాంట్‌లో ఆల్టో, వ్యాగన్ఆర్‌తో సహా పలు ప్రసిద్ధ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 7 లక్షల యూనిట్లు. గుర్గావ్‌ కాకుండా, కంపెనీకి మనేసర్‌లో మరో తయారీ కేంద్రం కూడా ఉంది. ఈ రెండు ప్లాంట్ల మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15.5 లక్ష యూనిట్లు.

Source: Times Of India

Most Read Articles

English summary
Maruti Suzuki India To Setup New Plant In Hryana, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X