మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా దాదాపు గత నెల రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ వైరస్‌పై పోరులో భాగంగా, ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు ముందుకొచ్చి తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్నాయి.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

ఇందులో భాగంగానే, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గతంలో తమ ప్లాంట్లలో కార్ల తయారీని నిలిపివేసి, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించింది. కాగా, ఈ భారతీయ కంపెనీ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకుంది.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

మారుతి సుజుకి హర్యానాలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో 4 ఆక్సిజన్ పిఎస్‌ఎ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ ఆక్సిజన్ పిఎస్ఎ ప్లాంట్లను స్వయంగా ప్రారంభించారు. హర్యానా రాష్ట్రంలో ప్రారంభించిన 4 ఆక్సిజన్ పిఎస్‌ఎ జనరేషన్ ప్లాంట్లలో ఇది మొదటి బ్యాచ్.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

గురుగ్రామ్‌లోని సెక్టార్ 10లో ఉన్న సివిల్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ పిఎస్‌ఎ ప్లాంట్లలో ఒకటి రోజుకి 1 టన్ను మరియు ఇంకొకటి రోజుకు 0.5 టన్ను ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు. అలాగే, గురుగ్రామ్‌లోని సెక్టార్ 9ఏ మరియు సెక్టార్ 3లో ఉన్న ఈఎస్ఐసి ఆస్పత్రులలో, రోజుకు 1 టన్ను ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను కంపెనీ ఏర్పాటు చేసింది.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

దేశంలో ఆక్సిజన్ పిఎస్‌ఎ ప్లాంట్లను ఉత్పత్తి చేసే స్థానిక చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తామని మారుతి సుజుకి ఇప్పటికే ప్రకటించింది. ఇది ఆక్సిజన్ ప్లాంట్ల తయారీని పెంచడంలో సహకరిస్తుంది. ఇప్పటికే, అనేక ఆక్సిజన్ ప్లాంట్ల తయారీతో మారుతి సుజుకి తమ సహకారాన్ని పెంచుకుంటోంది.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

జూన్ 2021 మొదటి అర్ధభాగం నాటికి ఇలాంటివి 24 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మారుతి సుజుకి పేర్కొంది. మారుతి సుజుకి మరియు దాని సరఫరాదారులు సిఎస్ఆర్ చొరవలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా, ఈ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు విజయవంతంగా నిర్వహించడానికి కంపెనీ ఓ ప్రత్యేక బృందాన్ని కూడా నియమించింది.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

ఆయా ఆస్పత్రులలో ఈ ఆక్సిజన్ జనరేటర్లను స్థాపించిన తర్వాత, అవి సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని నిర్ధారించడానికి బృందం కొన్ని నెలల పాటు తమ పర్యవేక్షణను కొనసాగిస్తుంది. ప్రచారం, ఛానెల్ విచారణ మరియు ఆర్డర్లను వ్యాప్తి చేయడానికి సంస్థ ఒక వెబ్‌సైట్‌ను కూడా సృష్టించింది. ఇది ఆస్పత్రుల అవసరాలను తీర్చుతుంది.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

ఈ ప్రత్యేకమైన చొరవ గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్.సి.భార్గవ మాట్లాడుతూ, "కోవిడ్ వ్యాప్తిపై పోరులో భాగంగా, ఆక్సిజన్ కోసం పిఎస్ఎ ప్లాంట్ల ఉత్పత్తిని పెంచడానికి మారుతి సుజుకి ఈ3 తయారీదారులకు మద్దతు ఇస్తోందని, తాము ఈ ప్రాజెక్టులోకి ప్రవేశించిన ఒక నెలలోనే, ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లను 10 రెట్లు పెంచే సామర్థ్యంతో పనిచేస్తున్నామని అన్నారు.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

మే నెలలో 70 ప్లాంట్లను మరియు జూన్ నెలలో 150 ప్లాంట్లను పంపిణీ చేయాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం అంచనా వేసిన ఉత్పత్తి కంటే ఎక్కువ.

మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

ఈ ప్రయత్నం గురించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ మాట్లాడుతూ, "హర్యానా రాష్ట్ర అభివృద్ధిలో మారుతి సుజుకి చాలా కీలక పాత్రను పోషిస్తందని, అవసరం వచ్చిన ప్రతిసారి మారుతి సుజుకి తనవంతు సాయం చేస్తూ ఉంటుందని, కరోనా మొదటి వేవ్ సమయంలో కూడా రాష్ట్రంలో చాలా అవసరమైన వెంటిలేటర్లతో ముందుకు వచ్చిన మొదటి సంస్థలో మారుతి సుజుకి కూడా ఒకటి" అని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
Maruti Suzuki Installs 4 Oxygen PSA Plants In Three Haryana Hospitals, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X