సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న తమ లేటెస్ట్ ఆఫ్-రోడ్ ఎస్‌‌యూవీ సుజుకి జిమ్నీని భారత మార్కెట్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసినదే.

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఈ మోడల్‌ను భారత్‌లో ఉత్పత్తి కూడా చేస్తోంది. ఇక్కడ తయారైన సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని కంపెనీ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సుజుకి జిమ్నీలో 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో 5-డోర్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

ఈ నేపథ్యంలో, తాజాగా సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. వాటిలో ఈ ఎస్‌యూవీ పరిమాణం మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ఉంది.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

ఆన్‌లైన్‌లో లీకైన పత్రాల ప్రకారం, 5-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ పొడవు 3,850 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,730 మిమీ మరియు వీల్‌బేస్ 2,550 మిమీ ఉంటుంది. అదే సమయంలో 3-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ కొలతలను గమనిస్తే, దాని పొడవు 3,550 మిమీ మరియు వీల్‌బేస్ 2,250 మిమీగా ఉంటుంది.

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

అంతేకాకుండా, సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ యొక్క మొత్తం బరువు 1,190 కిలోలు మరియు దాని గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో కంపెనీ 15 ఇంచ్ వీల్స్‌పై 195/80 సెక్షన్ రబ్బర్ టైర్లను ఉపయోగిస్తోంది.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

ఇక ఇంజన్ వివరాలకు వస్తే, సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్, కె15బి, డిఓహెచ్‌సి 16 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 101 బిహెచ్‌పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. మారుతి సుజుకి దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి, సియాజ్ సెడాన్ మరియు విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఇప్పటికే ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తోంది.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

ప్రస్తుతం భారతదేశంలో తయారైన సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు యూరప్ దేశాలలో విక్రయిస్తోంది. సుజుకి జిమ్మీ యొక్క జపనీస్ వెర్షన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 102 బిహెచ్‌పి శక్తిని మరియు 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన ఐదవ తరం మోడళ్లను కంపెనీ తమ తేలికపాటి హార్టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. కాగా, భారతదేశంలో త్వరలో విడుదల కానున్న సుజుకి జిమ్నీని, భారీ లాడర్-ఫ్రేమ్ ఛాస్సిస్‌పై తయారు చేసే అవకాశం ఉంది.

MOST READ:భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్

సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ పరిమాణంలో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండటం వలన ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారులో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీ దాని డిజైన్ మరియు ఆఫ్-రోడింగ్ సామర్ధ్యాల వలన గ్లోబల్ మార్కెట్లలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది.

Source: Team BHP

Most Read Articles

English summary
Maruti Suzuki Jimny 5-Door SUV Engine, Specs, Dimensions Leaked Online. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X