Just In
- 6 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 7 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా ఎడిషన్‌ను విడుదల; ధర, వివరాలు
మారుతి సుజుకి ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ 'వ్యాగన్ఆర్'లో కంపెనీ ఎక్స్ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా ఎడిషన్‌ను V-వేరియంట్లో 1-లీటర్ లేదా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందిస్తున్నాయి.
స్టాండర్డ్ V వేరియంట్‌తో పోల్చుకుంటే, ఈ ఎక్స్ట్రా ఎడిషన్ వేరియంట్లో 13 అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్ అప్గ్రేడ్లు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఎక్స్ట్రా వేరియంట్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ఎక్స్ట్రా వేరియంట్లో లభించే ఫీచర్లను యాక్సెసరీస్ కిట్‌గా పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ కిట్ ధర రూ.22,900 గా ఉంటుంది. వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా వేరియంట్లోని ఎక్స్టీరియర్ కిట్‌లో ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ప్రొటెక్టర్స్, సైడ్ స్కర్ట్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీ సైడ్ మౌల్డింగ్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, రియర్ డోర్ క్రోమ్ గార్నిష్, నంబర్ ప్లేట్ గార్నిష్ వంటి స్టైలింగ్ యాక్సెసరీస్ ఉన్నాయి.
అంతేకాకుండా, ఈ కిట్‌లో మూడు సౌకర్యవంతమైన యాక్ససరీస్ కూడా ఉంటాయి. వీటిలో డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్ మరియు కార్ ఛార్జర్ ఎక్స్టెండర్ ఉన్నాయి. కంపెనీ వీటన్నింటినీ ఓ కిట్ రూపంలో అందిస్తోంది. వీటిని విడివిడిగా కొనుగోలు చేయాలంటే సుమారు రూ.30,000 ఖర్చు అవుతుంది, కాగా ఈ మొత్తం కిట్ కంపెనీ రూ.23,000 లకే అందిస్తోంది.
ఈ కిట్‌లో ఉండే వ్యక్తిగత యాక్ససరీస్ మరియు వాటి ధరలు
- ఫ్రంట్ బంపర్ ప్రొటెక్టర్ - రూ.3,090
- రియర్ బంపర్ ప్రొటెక్టర్ - రూ.2,490
- సైడ్ స్కర్ట్ - రూ.6,490
- వీల్ ఆర్చ్ క్లాడింగ్ - రూ.5,290
- బాడీసైడ్ క్లాడింగ్ - రూ.2,490
- ఫాగ్‌ల్యాంప్స్ గార్నిష్ - రూ.590
- అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్ - రూ.790
- రియర్ డోర్ క్రోమ్ గార్నిష్ - రూ.890
- నంబర్ ప్లేట్ గార్నిష్ - రూ.499
- ఇంటీరియర్ కిట్ - రూ.5,990
- డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్ - రూ.2,111
- ట్రంక్ ఆర్గనైజర్ - రూ.1,290
- కార్ ఛార్జర్ ఎక్స్టెండర్ - రూ.999
ఇక వ్యాగన్ఆర్ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఇండియా సంస్థకు కాసుల పంట కురిపిస్తున్న కార్లలో కొత్త వ్యాగన్ఆర్ కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ మునుపటి తరం మోడళ్ల కన్నా పెద్దదిగా ఉంటుంది. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, బూట్ స్పేస్ మరియు శక్తివంతమైన ఇంజన్, లేటెస్ట్ టెక్ ఫీచర్లతో ఇది లభిస్తుంది.
మారుతి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. వీటిలో మొదటిది 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 67 బిహెచ్పి పవర్‌ను మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.2 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 82 బిహెచ్పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి వ్యాగన్ఆర్లో కంపెనీ అనేక సేఫ్చీ ఫీచర్లను కూడా అందిస్తోంది. వీటిలో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి.
భారత మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధరలు రూ.4.80 లక్షల నుండి రూ.6.33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాటి సమాచారాన్ని విడుదల చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
జులై 2021లో 36 శాతం పెరిగిన మారుతి సేల్స్
గడచిన జూలై 2021 నెలలో మారుతి సుజుకి దేశీయ కార్ల విక్రయాలు 36 శాతం వృద్ధి చెందగా ఎగుమతులు 7 శాతం పెరిగాయి. జులై 2020లో మారుతి సుజుకి మొత్తం 1,08,064 యూనిట్లను విక్రయించగా, జులై 2021లో 1,62,462 యూనిట్లను విక్రయించింది.