కస్టమర్లు ఏయే మారుతి సుజుకి కార్లని ఎక్కువగా కొంటున్నారు?
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గత జనవరి 2021 నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,39,002 కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంతో (జనవరి 2020తో) పోల్చుకుంటే గత నెలలో కంపెనీ దేశీయ అమ్మకాలు 0.6 శాతం తక్కువగా నమోదయ్యాయి.

జనవరి 2020 మారుతి సుజుకి మొత్తం 1,39,844 కార్లను విక్రయించింది. అదే డిసెంబర్ 2020తో పోల్చుకుంటే, జనవరి 2021లో కంపెనీ అమ్మకాలు 1.2 శాతం తక్కువగా ఉన్నాయి.

దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టో హ్యాచ్‌బ్యాక్ గత నెలలో 18,260 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. జనవరి 2020లో వీటి సంఖ్య 18,914 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 3 శాతం క్షీణతను నమోదు చేశాయి.

ఆల్టో తర్వాత మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి స్విఫ్ట్. గత నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు 17,180 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జనవరిలో వీటి సంఖ్య 19,981 యూనిట్లుగా నమోదైంది. ఈ సమయంలో స్విఫ్ట్ అమ్మకాలు 14 శాతం తగ్గాయి.

మారుతి సుజుకి విక్రయిస్తున్న టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వాగన్ఆర్ అమ్మకాలలో కంపెనీ 13 శాతం వృద్ధిని చూసింది. జనవరి 2021లో ఈ మోడల్ అమ్మకాలు 17,165 యూనిట్లుగా నమోదు కాగా, జనవరి 2020లో వీటి సంఖ్య 15,232 యూనిట్లుగా ఉన్నాయి.

అత్యంత పోటీతో కూడుకున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ మరియు హ్యుందాయ్ జాజ్ వంటి మోడళ్లకు పోటీగా విక్రయించబడుతున్న మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు జనవరి 2021లో 16,648 యూనిట్లుగా నమోదయ్యాయి.

గత జనవరి 2021 నెలలో మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ డిజైర్ అమ్మకాలు 32 శాతం తగ్గి 15,125 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, జనవరి 2020లో మాత్రం దీని అమ్మకాలు 22,406 యూనిట్లుగా ఉన్నాయి.

గత నెలలో మారుతి సుజుకి ఈకో అమ్మకాలు 5 శాతం తగ్గి 11,680 యూనిట్లుగా నమోదు కాగా, విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు 5 శాతం పెరిగి 10,623 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు 91 శాతం పెరిగి 9,565 యూనిట్లుగా ఉన్నాయి.

ఇకపోతే జనవరి 2021లో సెలెరియో 6,693, ఎస్-ప్రెస్సో 6,893, ఎక్స్ఎల్6 ఎమ్‌పివి 3,119, ఇగ్నిస్ 3,854, సియాజ్ 1,347 మరియు ఎస్-క్రాస్ 580 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. మొత్తంగా చూసుకుంటే, జనవరి 2021లో మారుతి సుజుకి అమ్మకాలు పర్వాలేదనిపించాయి.


Click it and Unblock the Notifications








