ఫిబ్రవరి 2021లో మారుతి స్విఫ్ట్‌దే అగ్రస్థానం, ఆ తర్వాత బాలెనో, వ్యాగన్ఆర్
గడచిన ఫిబ్రవరి 2021లో మారుతి సుజుకి ఇండియా తమ మోడల్ వారీ అమ్మకాల వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలువగా, దేశంలో కెల్లా అత్యధికంగా అమ్మడయ్యే కారుగా పేరు తెచ్చుకున్న ఆల్టో కారు నాల్గవ స్థానానికి పడిపోయింది.

నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఈ జాబితాలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా, టాల్‌బాయ్ కార్ వ్యాగన్ఆర్ మూడవ స్థానంలో నిలిచింది. మొత్తమ్మీద గడచిన ఫిబ్రవరిలో మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు, అంతకుముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

గత నెలలో మారుతి సుజుకి అందిస్తున్న మోడల్ వారీ అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:
| Rank | Model | Feb'21 | Feb'20 | Growth (%) |
| 1 | Maruti Swift | 20,264 | 18,696 | 8 |
| 2 | Maruti Baleno | 20,070 | 16,585 | 21 |
| 3 | Maruti WagonR | 18,728 | 18,235 | 3 |
| 4 | Maruti Alto | 16,919 | 17,921 | -6 |
| 5 | Maruti Dzire | 11,901 | 7,296 | 63 |
| 6 | Maruti Eeco | 11,891 | 11,227 | 6 |
| 7 | Maruti Vitara Brezza | 11,585 | 6,866 | 69 |
| 8 | Maruti Ertiga | 9,774 | 11,782 | -17 |
| 9 | Maruti S-presso | 7,040 | 9,578 | -26 |
| 10 | Maruti Celerio | 6,214 | 6,104 | 2 |
| 11 | Maruti Ignis | 3,340 | 2,912 | 15 |
| 12 | Maruti XL6 | 3,020 | 3,886 | -22 |
| 13 | Maruti S-Cross | 2,505 | 0 | - |
| 14 | Maruti Ciaz | 1,510 | 2,544 | -41 |
| 15 | Maruti Gypsy | 0 | 70 | -100 |
MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

ఇండియన్స్ ఫేవరేట్ స్మాల్ కార్ స్విఫ్ట్ గత ఫిబ్రవరి 2021లో 20,264 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఇదే సమయంతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 8 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2020లో స్విఫ్ట్ అమ్మకాలు 18,696 యూనిట్లుగా ఉన్నాయి. స్విఫ్ట్ కారులో కంపెనీ ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా విడుదల చేసింది.

నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా కంపెనీ ప్రత్యేకంగా విక్రయిస్తున్న మారుతి సుజుకి బాలెనో, గడచిన ఫిబ్రవరి నెలలో 20,070 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఇదే సమయంతో పోలిస్తే బాలెనో అమ్మకాలు 21 శాతం పెరుగుదలను చూశాయి. ఫిబ్రవరి 2020లో ఈ మోడల్ అమ్మకాలు 16,585 యూనిట్లుగా ఉన్నాయి.

గత నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు స్వల్పంగా 3 శాతం మేర పెరిగాయి. ఈ సమయంలో వ్యాగన్ఆర్ అమ్మకాలు 18,235 యూనిట్ల నుండి 18,728 యూనిట్లకు పెరిగాయి. ఈ జాబితాలో వ్యాగన్ఆర్ మూడవ స్థానంలో ఉంది.

మారుతి సుజుకి నుండి అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఆల్టో గడచిన ఫిబ్రవరి 2021లో నాల్గవ స్థానానికి పడిపోయింది. గత నెలలో 16,919 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య 17,921 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఆల్టో అమ్మకాలు 6 శాతం క్షీణించాయి.

మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ డిజైర్ గడచిన ఫిబ్రవరి నెలలో 11,901 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. అంతకు ముందు ఇదే సమయంలో దీని అమ్మకాలు 7,296 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ డిజైర్ అమ్మకాలు 63 శాతం పెరిగాయి.

కంపెనీ అందిస్తున్న బడ్జెట్ ఎమ్‌పివి ఈకో అమ్మకాలు స్వల్పంగా 6 శాతం పెరిగాయి. ఈ సమయంలో మారుతి ఈకో అమ్మకాలు 11,227 యూనిట్ల నుండి 11,891 యూనిట్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2021లో మారుతి విటారా బ్రెజ్జా అమ్మకాలు ఫిబ్రవరిలో 11,585 యూనిట్లుగా నమోదై 69 శాతం వృద్ధిని సాధించాయి.

ఈ సమయంలో మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు 17 శాతం క్షీణించి 11,782 యూనిట్ల నుండి 9774 యూనిట్లకు పడిపోయాయి. మారుతి ఎస్-ప్రెసో అమ్మకాలు కూడా 26 శాతం క్షీణించి 9,578 యూనిట్ల నుండి 7040 యూనిట్లకు తగ్గాయి.

ఫిబ్రవరి 2021లో మారుతి సుజుకి సెలెరియో మరియు ఇగ్నిస్ మోడళ్ల అమ్మకాలు వరుసగా 6214 యూనిట్లు మరియు 3340 యూనిట్లుగా ఉండి 2 శాతం మరియు 15 శాతం వృద్ధిని సాధించాయి. మారుతి ఎక్స్‌ఎల్6 అమ్మకాలు 22 శాతం తగ్గి 3020 యూనిట్లకు పడిపోయాయి.

గత నెలలో మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ అమ్మకాలు 2505 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో సియాజ్ అమ్మకాలు 41 శాతం తగ్గి 2,544 యూనిట్ల నుండి 1510 యూనిట్లకు పడిపోయాయి. మారుతి సుజుకి మొత్తంగా గతేడాది ఫిబ్రవరిలో 1.33 లక్షల యూనిట్లను విక్రయిస్తే పోలిస్తే, ఈ ఫిబ్రవరి నెలలో 1.44 లక్షల యూనిట్లను విక్రయించింది.
Source: Autopunditz


Click it and Unblock the Notifications