Just In
- 14 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 24 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 32 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐదేళ్లలో అరుదైన రికార్డ్ సాధించిన మారుతి సుజుకి నెక్సా బ్రాండ్
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో, దేశంలోనే నెంబర్ వన్ కార్ బ్రాండ్‌గా ఉన్న మారుతి సుజుకి ఇండియా, దేశీయ మార్కెట్లో తమ ప్రీమియం కార్లను విక్రయించేందుకు ప్రత్యేకంగా నెక్సా డీలర్‌షిప్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే.

గత ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ నెక్సా బ్రాండ్ ఇప్పుడు అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మారుతి సుజుకి తమ స్టాండర్డ్ కార్లను అరేనా షోరూమ్‌ల ద్వారా మరియు కాస్తంత ప్రీమియం అయిన కార్లను నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తోంది.

గత 2015లో ప్రారంభమైనప్పటి నుండి మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా 13 లక్షలకు పైగా కార్లను విక్రయించాయి. ప్రస్తుతం నెక్సా కార్ షోరూమ్‌ల ద్వారా బాలెనో, సియాజ్, ఇగ్నిస్, ఎక్స్‌ఎల్-6 మరియు ఎస్-క్రాస్ మోడళ్లను విక్రయిస్తున్నారు.

మొదట్లో మారుతి నెక్సా షోరూమ్‌లను ప్రారంభించినప్పుడు, ఈ షోరూమ్‌ల ద్వారా కేవలం ఎస్-క్రాస్ మోడల్‌ను మాత్రమే విక్రయించే వారు. ఆ తర్వాత కంపెనీ ఈ షోరూమ్‌లలో తమ ప్రీమియం మోడళ్ల లైనప్‌ను క్రమంగా పెంచుతూ వస్తోంది.

మారుతి సుజుకి ఇండియా గత ఏడాది సరికొత్త ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ రాకతో ఎస్-క్రాస్ అమ్మకాలు ఇదివరకటిన్నా రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ మరియు మూడవ త్రైమాసికాల్లో ఈ కారు అమ్మకాలు 104 శాతం పెరిగాయి.

అలాగే, గడచిన 2017లో ప్రారంభమైన మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాలు కూడా మొత్తంగా 1.4 లక్షల యూనిట్లకు చేరుకున్నట్లు మారుతి సుజుకి ఇండియా పేర్కొంది. దీని ఆకర్షణీయమైన డిజైన్ యవ కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

మారుతి సుజుకి పేర్కొన్న నివేదిక ప్రకారం, సుజుకి ఇగ్నిస్ కారును కొనేవారిలో 45 శాతానికి పైగా కస్టమర్లు 35 ఏళ్లలోపు వారేనని సమాచారం. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌లో మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ బ్రాండ్‌గా నెక్సా తన ప్రముఖ స్థానాన్ని కొనసాగిస్తున్నందకు తామెంతో గర్విస్తున్నామని అన్నారు.