కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ ఇటీవల 2021 నవంబర్ నెల యొక్క అమ్మకాల గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ మొత్తం విక్రయాలు మునుపటికంటే కూడా దాదాపు 9 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ యొక్క అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2021 నవంబర్ నెలలో 1,39,184 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. అయితే 2020 నవంబర్ నెలలో కంపెనీ 1,53,233 యూనిట్లను విక్రయించింది. అంటే మునుపటికంటే ఈ ఏడాది నవంబర్ నెలలో క్షీణతను నమోదు చేసింది, అని స్పష్టంగా తెలిసింది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

గత నెలలో మారుతి సుజుకి విక్రయించిన 1,09,726 ప్యాసింజర్ వాహనాల్లో, 70 శాతానికి పైగా మినీ మరియు కాంపాక్ట్ వెహికల్ సెగ్మెంట్ నుండి వచ్చింది. ఇందులో ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో, స్విఫ్ట్ మరియు ఇతర మారుతీ కార్లు ఉన్నాయి. ఈ వాహనాలు గత నెలలో కార్ల తయారీ సంస్థకు 74,492 యూనిట్ల విక్రయాలను అందించాయి.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

కాంపాక్ట్ వెహికల్ సెగ్మెంట్‌తో పోలిస్తే, సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్6 తో కూడిన మిడ్-సైజ్ మరియు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లు గత నెలలో జరిగిన మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 25 శాతం వాటాను అందించాయి. మారుతి గత నెలలో 1,089 సియాజ్ యూనిట్లను విక్రయించగా, ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్ విటారా బ్రెజ్జా మరియు XL6 వంటి యుటిలిటీ వాహనాలు మొత్తం 24,574 యూనిట్ల విక్రయాలను అందించింది. అయితే అమ్మకాలు అక్టోబర్ 2021 తో పోల్చితే నవంబర్ 2021 అమ్మకాలలో స్వల్ప పెరుగుదల ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం అక్టోబర్ 2021 లో కంపెనీ 1,38,335 యూనిట్లను విక్రయించింది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

ప్రస్తుతం సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇది ఇలాగే మరింత కాలం కొనసాగే అవకాశం కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. సెమీకండక్టర్ల కొరత కారణంగా 2021 డిసెంబర్‌ నెలలో కూడా ఉత్పత్తి దాదాపు 15 నుంచి 20 శాతం తగ్గే అవకాశం ఉంటుంది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

మారుతి సుజుకి ఇటీవల దేశీయ మార్కెట్లో సెలెరియో హ్యాచ్‌బ్యాక్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ కొత్త మారుతి సెలెరియో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే మారుతి సెలెరియో యొక్క టాప్ మోడల్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కారు, కంపెనీ యొక్క అమ్మకాలు పెరగటానికి దోహదపడే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మారుతి సుజకి త్వరలో విటారా బ్రెజ్జా, బాలెనో మరియు ఆల్టోతో సహా అనేక ఇతర ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంటుంది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

రానున్న 2022 సంవత్సరంలో కూడా సెమీకండక్టర్ల కొరత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. గ్లోబల్ చిప్ కొరత 2022 లో కూడా ఏడాది పొడవునా కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు వస్తున్న మరో కొత్త వైరస్ కారణంగా మళ్ళీ ఆటోమోటివ్ రంగం నష్టాలను చవి చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

మారుతి సుజుకి 2021 సెప్టెంబర్‌లో 40 శాతం, అక్టోబర్‌లో 60 శాతం, నవంబర్‌లో 85 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలిగింది. అయితే కంపెనీ ఇక రానున్న రోజుల్లో డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలివేయనున్నట్లు కూడా తెలిపింది. కంపెనీ దేశంలో బిఎస్ 6 ప్రమాణాలు ప్రారంభమ కాకముందే 2019 వ సంవత్సరంలోనే ఈ డీజిల్ ఇంజిన్ మోడల్స్ తయారీని నిలిపివేసింది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

అయితే, గత కొన్ని నెలలుగా మారుతీకి చెందిన CNG కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. 2023 లో కొత్త దశ ఉద్గార ప్రమాణాలు అమలులోకి వస్తాయి. ఇది ఖర్చులను మరింత పెంచే అవకాశం ఉంది. మారుతీ సుజుకి ప్రస్తుతం ఈ విభాగంలో 85 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో దేశంలో CNG కార్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉంది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో విక్రయించిన 1.9 లక్షల యూనిట్ల CNG వాహనాల్లో 1.6 లక్షలకు పైగా CNG కార్లను మారుతీ సుజుకీ విక్రయించింది. ఇది నిజంగా చాలా ప్రశంసనీయం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా CNG డిస్పెన్సింగ్ అవుట్‌లెట్‌ల యొక్క వేగవంతమైన విస్తరణను కంపెనీ అంచనా వేస్తుంది, ఇది CNG కార్ మార్కెట్ యొక్క వేగవంతమైన విస్తరణకు దారి తీస్తుంది.

కలిసిరాని పండుగ సీజన్.. అమ్మకాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: Maruti Suzuki

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు లక్షల CNG కార్ యూనిట్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్ వంటి వాటిని CNG వేరియంట్‌లను అందిస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రవేశపెట్టిన కొత్త సెలెరియో యొక్క CNG వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏది ఏమైనా కంపెనీ యొక్క CNG కార్లు రాబోయే రోజుల్లో మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది, కావున కంపెనీ యొక్క అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

Most Read Articles

English summary
Maruti suzuki car sales november 139184 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X