మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

భారతదేశంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెట్లో తమ అన్ని డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసి కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. పెట్రోల్ కార్లతో పాటుగా కంపెనీ సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే కార్లను కూడా అందిస్తోంది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

మారుతి సుజుకి తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు అన్ని చిన్న కార్లలో సిఎన్‌జి వేరియంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్ మరియు ఎర్టిగా మోడళ్లలో సిఎన్‌జి-పవర్‌తో నడిచే వాహనాలను విక్రయిస్తోంది. తాజాగా, ఈ జాబితాలోకి కంపెనీ యొక్క పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా కూడా వచ్చి చేరనుంది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

గడచిన 2016లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ప్రస్తుతం ఈ విభాగంలో అత్యంత పోటీతత్వ మోడల్‌గా కొనసాగుతోంది. అయితే, ఇదే విభాగంలో లభిస్తున్న ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలు మాత్రం వివిధ రకాల ఇంజన్, ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుండగా, విటారా బ్రెజ్జా మాత్రం కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

ఈ నేపథ్యంలో, విటారా బ్రెజ్జా అమ్మకాలను పెంచుకునేందుకు మరియు ఇందులో అధిక మైలేజీనిచ్చే వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ ఈ మోడల్‌లో కొత్త సిఎన్‌జి వేరియంట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. తాజాగా, ఇందుకు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

సిఎన్‌జి వెర్షన్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో 1,462 సిసి కె15బి పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించవచ్చని సమాచారం. అయితే, ఇది 74.0 × 85.0 బోర్, స్ట్రోక్ మరియు కంప్రెషన్ నిష్పత్తిని కలిగి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం స్టాండర్డ్ బ్రెజ్జాలో ఉపయోగిస్తున్న బిఎస్6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 77 కి.వా (103.2 హెచ్‌పి) శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

అయితే, సిఎన్‌జి వెర్షన్ విటారా బ్రెజ్జాలో ఈ పవర్ మరియు టార్క్ తక్కువగా ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ సిఎన్‌జి వెర్షన్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 68 కి.వా (91.2 హెచ్‌పి) శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానుంది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

పెట్రోల్ ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో, మారుతి సుజుకి నుండి పాపులర్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సిఎన్‌జి వెర్షన్ అందుబాటులోకి వచ్చినట్లయితే, ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. ఈ వాహనం గురించి మరిన్ని వివరాలను కంపెనీ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

మారుతి సుజుకి విటారా బ్రెజ్జాను మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ఆరు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఇటీవల వెల్లడించింది. గతేడాది ఆటో ఎక్స్‌పోలో విటారా బ్రెజ్జాలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. దాని డిజైన్‌లో గణనీయమైన మార్పులు లేనప్పటికీ, కంపెనీ దాని ఫీచర్లు మరియు ఇంజన్‌లో మార్పులు చేసింది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

కొత్త 2020 బ్రెజ్జాలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు, అప్‌డేట్ చేయబడిన ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ వంటి కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. లోపలి వైపు 7.0 ఇంచ్ స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించింది.

మారుతి విటారా బ్రెజ్జాలో డీజిల్ వెర్షన్ లేదు.. కానీ సిఎన్‌జి వెర్షన్ వస్తోంది..

ప్రస్తుతం మార్కెట్లో విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు రూ.7.39 లక్షల నుండి రూ.11.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా నెక్సాన్, రెనో కైగర్, కియా సొనెట్ ఎస్‌యూవీ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.ఏది ఏమైనా ఈ విభాగంలో విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti suzuki plans to launch vitara brezza cng version soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X