Just In
- 1 hr ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిసెంబర్ 2019 కంటే డిసెంబర్ 2020లోనే బెటర్: మారుతి సుజుకి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గడచిన డిసెంబర్ నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను సాధించింది. డిసెంబర్ 2020 నెలలో తమ మొత్తం అమ్మకాలలో 20.2 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి గత డిసెంబర్ 2020లో మొత్తం 1,60,226 యూనిట్లను విక్రయించగా, డిసెంబర్ 2019లో 1,33,296 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ సమయంతో పోలిస్తే, కంపెనీ వార్షిక అమ్మకాలు 20.2 శాతం పెరిగాయి.

గత నెలలో మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు (డొమెస్టిక్ సేల్స్) కూడా వృద్ధిని సాధించాయి. డిసెంబర్ 2020లో కంపెనీ మొత్తం 1,50,288 యూనిట్లను భారతదేశంలో విక్రయించగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి అమ్మకాలు 1,25,753 యూనిట్లుగా నమోదై 19.5 శాతం వృద్ధిని సాధించాయి.
MOST READ:ఊపందుకున్న హీరో మోటోకార్ప్ సేల్స్.. భారీగా పెరిగిన డిసెంబర్ అమ్మకాలు

ఈ దేశీయ అమ్మకాలలో ఇతర ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరర్)లకు పంపిన 3,808 యూనిట్లు కూడా ఉన్నాయి. ఈ మోడళ్లలో టొయోటా అర్బన్ క్రూయిజర్‌గా విక్రయించబడే మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు టొయోటా గ్లాంజాగా అమ్మబడే మారుతి సుజుకి బాలెనో మోడళ్లు ఉన్నాయి.

గత నెలలో మారుతి సుజుకి ఇండియా ఎగుమతుల విషయానికి వస్తే, డిసెంబర్ 2020లో కంపెనీ మొత్తం 9,938 యూనిట్లను ఎగుమతి చేసింది. డిసెంబర్ 2019లో వీటి సంఖ్య 7561 యూనిట్లుగా నమోదై 31.4 శాతం వృద్ధిని సాధించాయి.
MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

ప్యాసింజర్ వాహన విభాగంలో మారుతి సుజుకి అందిస్తున్న వివిధ రకాల హ్యాచ్‌బ్యాక్‌లు అన్నీ కలిపి 77,641 యూనిట్లుగా నమోదై 18.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మోడళ్ల జాబితాలో వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో మొదలైనవి మోడళ్లు ఉన్నాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లతో కూడిన మినీ సెగ్మెంట్ డిసెంబర్ 2019లో 23,883 యూనిట్లుగా ఉంటే, డిసెంబర్ 2020లో 24,927 యూనిట్లుగా నమోదై 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో మారుతి సుజుకి యుటిలిటీ వాహన విభాగం కూడా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగంలో విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ మరియు ఎక్స్‌ఎల్6 వంటి మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది. ఈ విభాగంలో గత నెలలో 25,701 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, డిసెంబర్ 2019లో ఇవి 23,808 యూనిట్లుగా ఉన్నాయి.
MOST READ:క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న ఎంజి జెడ్‌ఎస్ పెట్రోల్ : పూర్తి వివరాలు

కాగా, మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో కంపెనీ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ విభాగంలో కంపెనీ ఒకే ఒక మోడల్‌ను మాత్రమే విక్రయిస్తోంది. డిసెంబర్ 2020లో సియాజ్‌తో కూడిన మిడ్-సైజ్ సెడాన్ విభాగం 28.9 శాతం క్షీణతను నమోదు చేసింది. గత డిసెంబర్ 2019లో 1,786 యూనిట్ల సియాజ్ కార్లు అమ్ముడుపోగా, డిసెంబర్ 2020లో 1,270 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మొత్తంగా చూసుకుంటే, మారుతి సుజుకి ఇండియా గడచిన ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో అమ్మకాల పరంగా 18 శాతం క్షీణతను నమోదు చేసింది. ఏప్రిల్-డిసెంబర్ 2020 మధ్య కాలంలో కంపెనీ 9,65,626 యూనిట్లను విక్రయించగా 2019లో ఇదే కాలంలో 11,78,272 యూనిట్లను విక్రయించింది. లాక్‌డౌన్ కాలంలో సున్నా అమ్మకాలు నమోదు కావటమే ఈ క్షీణతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
MOST READ:ఇక బ్యాటరీ చార్జింగ్ సమస్యే ఉండదు; కొత్తగా 500, రెండేళ్లలో 10,000 చార్జింగ్ స్టేషన్లు