మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ విక్రయిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ సిఎన్‌జి (కంప్రెస్ట్ న్యాచురల్ గ్యాస్) వేరియంట్లో కూడా లభిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో మూడు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి వెర్షన్ ఇప్పుడు రెగ్యులర్ పూల్‌సైడ్ బ్లూ కలర్ ఆప్షన్‌తో పాటుగా కొత్త నట్‌మెగ్ బ్రౌన్, ఔటమ్ ఆరెంజ్ మరియు మాగ్నా గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. దీంతో వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి ఇప్పుడు మొత్తం నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభ్యమవుతుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దశాబ్ధాలుగా భారత స్మాల్ కార్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఇందులో సిఎన్‌జి వెర్షన్‌కు డిమాండ్ జోరందుకుంది. సిఎన్‌జి ఇంధనంతో నడిచే వాహనాల్లో అత్యంత ప్రియమైన వాహనంగా మారుతి సుజుకి వాగన్ఆర్ నిలిచింది.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

మారుతి సుజుకి అందిస్తున్న ఈ టాల్-బాయ్ కార్ "వాగన్ఆర్"లో ఎస్-సిఎన్‌జి వెర్షన్ మోడల్ ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. సిఎన్‌జి పవర్డ్ వ్యాగన్ఆర్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 3 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

అంతేకాకుండా, ఈ కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సిఎన్‌జి వాహనంగా కూడా నిలిచింది. మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తిని అధిగమించిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి మోడల్, ప్యాసింజర్ వాహన విభాగంలో అత్యంత విజయవంతమైన కారుగా అవతరించింది.

MOST READ:మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

మారుతి వాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి వెర్షన్ ఎల్ఎక్స్ఐ మరియు ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.5.46 లక్షలు మరియు రూ.5.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

ఈ కారులో 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 58 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500ఆర్‌పిఎమ్ వద్ద 78 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

మారుతి సుజుకి ఎస్-సిఎన్‌జి కార్లు ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో డ్యూయెల్ ఇంటర్‌ డిపెండెంట్ ఈసియుతో లభిస్తాయి. ఇది అన్ని భూభాగాల్లో అధిక ఇంధన సామర్థ్యంతో పాటు మెరుగైన మరియు స్థిరమైన పనితీరును అందించడంలో సహకరిస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

ఈ కారులో సిఎన్‌జి గ్యాస్ కోసం 60 లీటర్ ఇంధన ట్యాంక్ ఉంటుంది. వ్యాగన్ఆర్ పెట్రోల్ వెర్షన్ మైలేజ్ (21.79 కెఎంపిఎల్)తో పోల్చుకుంటే, సిఎన్‌జి వెర్షన్ మైలేజ్ దాదాపు 10 కి.మీ అధికంగా ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి కేజీకి 31.52 కి.మీ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జిలో 3 కొత్త కలర్ ఆప్షన్స్ విడుదల

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వ్యాగన్ఆర్ కారును 5వ తరానికి చెందింది. ఈ కారును మారుతి సుజుకి యొక్క సరికొత్త హార్టెక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే కార్లు, కారులోని ప్రయాణీకుల సేఫ్టీని పెంచడానికి క్రాష్ ఎనర్జీని సమర్థవంతంగా గ్రహించి, మెరుగైన స్థిరత్వానికి భరోసా ఇస్తాయని కంపెనీ చెబుతోంది.

Most Read Articles

English summary
Maruti Suzuki WagonR S-CNG Gets Three New Colour Options, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X