దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మైక్రో ఎస్‌యూవీ ఎస్-ప్రెసో కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. గడచిన 2019లో ఈ మోడల్‌ను మార్కెట్ ప్రారంభించినప్పటి నుండి, ఇది భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన అందుకుంటోంది.

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

ఎంట్రీ లెవల్ కార్ విభాగంలో వచ్చిన ఈ కార్, దాని నెలవారీ అమ్మకాలలో బాగా రాణిస్తోంది. విశిష్టమైన డిజైన్, మోడ్రన్ స్టైల్, సరసమైన ధర, మెరుగైన మైలేజ్ మరియు విశ్వనీయమైన బ్రాండ్ వంటి అనేక అంశాల్లో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో చిన్నసైజు ఎస్‌యూవీ లాంటి కార్ కావాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్‌గా ఉంటోంది.

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

గడచిన ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి ఇండియా మొత్తం 7,737 యూనిట్ల ఎస్-ప్రెసో కార్లను విక్రయించింది. అంతకు ముందు (మార్చి 2021) నెలలో విక్రయించిన 7,252 యూనిట్లతో పోలిస్తే ఈ ఎంట్రీ లెవల్ కార్ అమ్మకాలు 6.7 శాతం పెరిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎంట్రీ లెవల్ కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెసో కూడా ఒకటి. ఇది ఈ విభాగంలో రెనో క్విడ్ మరియు డాట్సన్ రెడీ-గో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మారుతి సుజుకి అందిస్తున్న ఆల్టో కారు కన్నా ఎత్తైన రైడ్ మరియు విశాలమైన ఇంటీరియర్ కలిగిన మోడల్ కావాలనుకునే వారికి ఎస్-ప్రెసో బెస్ట్ ఆప్షన్.

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెసో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3.78 లక్షలుగా ఉంటే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.5.26 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఇది కేవలం న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు పెట్రోల్-సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌లతో మాత్రమే లభిస్తుంది.

MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

మారుతి సుజుకి ఎస్-ప్రెసో కారను కంపెనీ హార్టెక్-కె తేలికపాటి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇందులో 1.0-లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆప్షనల్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటుంది.

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లు లీటరుకు సగటున 21.4 కిలోమీటర్ల మైలేజీనిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా ఇందులోని ఆటోమేటిక్ (ఏఎమ్‌టి) ట్రాన్స్‌మిషన్‌తో కూడిన వేరియంట్లు లీటరుకు 21.7 కిలోమీటర్ల మైలేజీనిస్తాయని కంపెనీ తెలిపింది.

MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

మారుతి సుజుకి ఎస్-ప్రెసోలో కంపెనీ సిఎన్‌జి వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కంపెనీ అందిస్తోంది. ఇందులోని పెట్రోల్-సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌ గరిష్టంగా 59 బిహెచ్‌పి శక్తిని మరియు 78 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

ఈ ఎంట్రీ లెవల్ కారులో కంపెనీ అనేక అధునాత ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఫ్రంట్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మరియు 12వోల్ట్ పవర్ సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:బైకర్స్‌ తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి.. లేకుంటే?

దూసుకెళ్తున్న మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు; ఏప్రిల్‌లో 7,000 యూనిట్లకు పైగా..

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki S-Presso Registers Over 7000 Unit Sales In April 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X