సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన Maruti Suzuki సేల్స్!

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) అక్టోబర్ 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, కంపెనీ గత నెల అమ్మకాలలో క్షీణతను నమోదు చేసింది. అక్టోబర్ 2020 లో కంపెనీ విక్రయించిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే, అక్టోబర్ 2021లో అమ్మకాలు 34 శాతం తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

మారుతి సుజుకి గత నెలలో (అక్టోబర్ 2021 లో) దేశంలో మొత్తం 1,08,991 వాహనాలను విక్రయించింది మరియు ఇతర OEM లకు 4,225 యూనిట్లను (టొయోటా గ్లాంజా మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్) విక్రయించింది. కాగా, అక్టోబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 1,63,656 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ వార్షిక అమ్మకాలు దాదాపు 34 శాతం తగ్గాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

అయితే, సెప్టెంబరు 2021 నెలతో పోలిస్తే, అక్టోబర్ 2021లో మారుతి సుజుకి అమ్మకాల పనితీరు మెరుగ్గా ఉంది. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2021లో) మారుతి సుజుకి మొత్తం 63,111 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో మారుతి సుజుకి నెలవారీ అమ్మకాల వృద్ధి 73 శాతంగా ఉంది.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

గత నెలలో ఈ ఇండో-జపనీస్ తయారీదారు (మారుతి సుజుకి), దాని మార్కెట్ వాటాలో కూడా గణనీయమైన తగ్గుదలని చూసింది. గ్లోబల్ సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా కంపెనీ అమ్మకాలు క్షీణించినట్లు భావిస్తున్నారు. ఈ సమస్య కారణంగా, మారుతి సుజుకి తన వాహనాల ఉత్పత్తిని పరిమితం చేయాల్సి వచ్చింది. ఫలితంగా, కొన్ని రకాల ఉత్పత్తుల వెయిటింగ్ పీరియడ్ పెరిగింది.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

ప్రస్తుత నవంబర్ 2021 నెలలో కూడా ఈ సెమీ కండక్టర్ చిప్స్ కొరత కొనసాగవచ్చని మారుతి సుజుకి అంచనా వేస్తోంది. ఈ సమస్య భారతదేశంలోని కార్ మేకర్లనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర ఆటోమొబైల్ తయారీదారులను కూడా కలవరానికి గురిచేస్తోంది. అయితే, వచ్చే ఏడాది ఆరంభం నాటికి పరిస్థితులు చక్కబడొచ్చని భావిస్తున్నాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

గత నెలలో మారుతి సుజుకి అందిస్తున్న వాహనాల విభాగం వారీగా అమ్మకాలను గమనిస్తే, యుటిలిటి వాహన విభాగం మినహా ఇతర అన్ని విభాగాలలో అమ్మకాలు క్షీణించాయి. ఆల్టో మరియు ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ సెగ్మెంట్ అక్టోబర్ 2021 లో 21,831 యూనిట్ల అమ్మకాలను కనబరిచింది. కాగా, అక్టోబర్ 2020 లో ఈ సెగ్మెంట్లో అమ్మకాలు 28,462 యూనిట్లుగా ఉన్నాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

అలాగే, బాలెనో, సెలెరియో, స్విఫ్ట్ డిజైర్, డిజైర్ టూర్ మరియు వ్యాగన్ఆర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్‌ లో, గత అక్టోబర్ 2020 నెలలో మొత్తం విక్రయాలు 95,067 యూనిట్లుగా ఉంటే, అవి ఈ అక్టోబర్ 2021 నెలలో 48,690 యూనిట్లకు పడిపోయాయి. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు అక్టోబర్ 2020 లో 1,422 యూనిట్లుగా ఉంటే, అవి గత నెలలో 1,069 యూనిట్లకు పడిపోయాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

మొత్తంగా చూసుకుంటే, అక్టోబర్ 2020 నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,24,951 యూనిట్లుగా ఉంటే, అవి గత నెలలో 71,590 యూనిట్లకు తగ్గాయి. ఈ సమయంలో ఇయర్ టూ డేట్ (ఏప్రిల్-అక్టోబర్) అమ్మకాలు మాత్రం 4,37,078 యూనిట్ల నుండి 4,79,253 యూనిట్లకు పెరిగాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

మారుతి సుజుకి ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఎక్స్6 వంటి వాహనాలను కలిగి ఉన్న యుటిలిటీ వాహన (యూవీ) సెగ్మెంట్ లో గడచిన అక్టోబర్ 2020 నెలలో 27,081 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు అక్టోబర్ 2021లో 25,396 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో మారుతి ఈకో వ్యాన్ అమ్మకాలు 13,309 యూనిట్ల నుండి 10,320 యూనిట్లకు పడిపోయాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

అక్టోబర్ 2021 నెలలో నుండి మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,08,991 యూనిట్లుగా ఉన్నాయి. ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్) విభాగంలో, మారుతి సుజుకి విక్రయిస్తున్న సూపర్ క్యారీ అమ్మకాలు కూడా పెరిగాయి. గత నెలలో (అక్టోబర్ 2021 లో) ఈ మోడల్ అమ్మకాలు 3,797 యూనిట్లుగా నమోదు కాగా, అక్టోబర్ 2020 లో ఇవి 3,169 యూనిట్లుగా ఉన్నాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

మారుతి సుజుకి మరియు టొయోటా కంపెనీల మధ్య కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా, మారుతి సుజుకి తయారు చేసిన టొయోటా గ్లాంజా (బాలెనో రీబ్యాడ్జ్ వెర్షన్) మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ (విటారా బ్రెజ్జా రీబ్యాడ్జ్ వెర్షన్) లను OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) రూపంలో ఈ జపనీస్ కంపెనీ విక్రయిస్తుంది.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

ఇలా వీటిని అక్టోబర్ 2020లో 6,037 యూనిట్లను విక్రయించగా, అక్టోబర్ 2021లో ఇవి 4,225 యూనిట్లకు పడిపోయాయి. ఇప్పటి వరకూ వీటి ఇయర్ టూ డేట్ అమ్మకాలను పరిశీలిస్తే ఏప్రిల్-అక్టోబర్ 2020 కాలంలో 12,153 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఏప్రిల్-అక్టోబర్ 2021 నాటికి 26,645 యూనిట్లకు పెరిగాయి.

సెమీకండక్టర్ షార్టేజ్: అక్టోబర్ 2021లో 34 శాతం పడిపోయిన మారుతి సుజుకి సేల్స్!

మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు తగ్గినప్పటికీ, ఎగుమతులు మాత్రం గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 2020లో 9,586 యూనిట్లుగా ఉన్న మారుతి సుజుకి కార్ల ఎగుమతులు గత నెలలో 21,322 యూనిట్లకు పెరిగాయి. అలాగే, ఇవి ఏప్రిల్-అక్టోబర్ 2020 కాలలో 41,669 యూనిట్లుగా ఉంటే, ఏప్రిల్-అక్టోబర్ 2021 నాటికి 1,26,249 యూనిట్లకు పెరిగాయి.

Most Read Articles

English summary
Maruti suzuki sales down by 34 percent in october 2021 due to semiconductor shortage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X