గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దశాబ్ధాలుగా ఇక్కడి మార్కెట్లో కార్ల వ్యాపారం చేస్తోంది. దేశీయ కస్టమర్ల నుండి ఈ బ్రాండ్ యనలేని విశ్వసనీయతను సంపాధించుకుంది. ప్రత్యేకించి గ్రామీణ మార్కెట్ల నుండి మారుతి సుజుకి కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

దేశంలోని గ్రామీణ మార్కెట్లలో ఇప్పటి వరకూ 50 లక్షలకు పైగా కార్లను విక్రయించామని మారుతి సుజుకి బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ మొత్తం కార్ల అమ్మకాల్లో 40 శాతం అమ్మకాలు గ్రామీణ భారతదేశం నుండే లభిస్తున్నాయని కంపెనీ తమ నివేదికలో పేర్కొంది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

గ్రామీణ మార్కెట్లలో దేశంలోని ఇతర ఆటోమొబైల్ బ్రాండ్లతో పోల్చుకుంటే, మారుతి సుజుకి చాలా విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ని కలిగి ఉంది. వివిధ గ్రామీణ ప్రాంతాల్లో మారుతి సుజుకి 1,700కి పైగా కస్టమైజ్డ్ అవుట్‌లెట్లతో దేశంలో కెల్లా అతిపెద్ద రూరల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

మారుతి సుజుకి గత కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ భారతదేశంలో తన అడుగుజాడలను విస్తరిస్తోంది. భారతదేశంలో కంపెనీ మొత్తం అమ్మకాలలో గ్రామీణ మార్కెట్ల వాటా విషయానికి వస్తే, ఇది 2008-2009 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం ఉంటే, 2020-2021 ఆర్థిక సంవత్సరం నాటికి 40.9 శాతానికి పెరిగింది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

ప్రస్తుతం తమ కంపెనీ వ్యాపారంలో గ్రామీణ మార్కెట్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని మారుతి సుజుకి తెలిపింది. గడచిన 2008లో ప్రపంచ మాంద్యం సమయంలో భారత గ్రామీణ మార్కెట్ చాలా తక్కువగా ప్రభావితమైందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ తమ కొత్త ఉత్పత్తులను గ్రామీణ మార్కెట్లలో ప్రవేశపెట్టిందని కంపెనీ తెలిపింది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

ఈ సమయంలో, మారుతి సుజుకి తమ కొత్త మరియు సరసమైన కాంపాక్ట్ కార్లను గ్రామీణ మార్కెట్లలో విడుదల చేసింది, వీటిని వినియోగదారులు కూడా చక్కగా ఆదరించారు. ఇటీవలి కాలంలో, మారుతి సుజుకి తమ ప్రీమియం కార్లను కూడా గ్రామీణ మార్కెట్లలోకి అందుబాటులో తీసుకువచ్చింది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్రీమియం కార్లను దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. అదే సమయంలో, కంపెనీ తమ బడ్జెట్ కార్లను అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తోంది. మారుతి సుజుకి ఇండియాకు దేశవ్యాప్తంగా అరేనా డీలర్‌షిప్‌లే ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారానే అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి కొత్తగా రూ.18,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించి హర్యానాలో మరొక కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ప్లాంట్ సాయంతో మారుతి సుజుకి అదనంగా ఏటా 10 లక్షల యూనిట్ల వాహనాలను తయారు చేయనుంది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, ఈ కొత్త ప్లాంట్‌ను 1,000 ఎకరాలలో స్థలంలో నిర్మించనున్నారు. ఇది గుర్గావ్ యొక్క పాత ప్లాంట్ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇదే గుర్గావ్ ప్లాంట్ నుండి మారుతి సుజుకి తమ వ్యాపారాన్ని తొలిసారిగా ప్రారంభించింది. ఈ ప్లాంట్ నుండే మారుతి 800 కారు తయారైంది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

ప్రస్తుతం గుర్గావ్ ప్లాంట్ 300 ఎకరాల స్థలంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్లాంట్ చుట్టూ ఏమీ ఉండేవి కావు. అయితే, గుర్గావ్‌లో జరిగిన అభివృద్ధి మరియు పట్టణీకరణ కారణంగా ఇప్పుడు ఈ ప్లాంట్ చుట్టూ జనావాసాలు ఏర్పడ్డాయి. దీంతో, మారుతి సుజుకి రవాణా విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల మారుతి సుజుకి కార్లు; బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వసనీయత

ఈ సమస్యకు నివారణంగా కంపెనీ ఇప్పుడు హర్యానా వైపు దృష్టి సారించింది. హర్యానాలో సరికొత్త ప్లాంట్‌ను ప్రారంభించడం ద్వారా దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో తన నాయకత్వ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Sold 50 Lakh Cars In Rural Markets; Achieves New Sales Milestone, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X