బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఇండియా తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్న ఇగ్నిస్ కారులో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. మారుతి సుజుకి ఇగ్నిస్ ఇకపై కొత్త బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో లభ్యం కానుంది.

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి తమ ఇగ్నిస్ కారును తొలిసారిగా 2017లో మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఇందులో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 2020లో ప్రవేశపెట్టింది. తాజాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో కొత్త బ్లాక్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు చూస్తోంది.

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. కొత్త బ్లాక్ కలర్ మినహా ఈ కారులో వేరే ఏ ఇతర మార్పులు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి ఇగ్నిస్ సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఈ కొత్త బ్లాక్ కలర్ కాకుండా, సిల్కీ సిల్వర్, గ్లిస్టెనింగ్ గ్రే, పెరల్ వైట్, లూసెంట్ ఆరెంజ్, లుసెంట్ ఆరెంజ్ విత్ బ్లాక్ రూఫ్, టార్కోయిస్ బ్లూ, నెక్సా బ్లూ, బ్లాక్ రూఫ్‌తో నెక్సా బ్లూ, సిల్వర్ రూఫ్‌తో నెక్సా బ్లూ వంటి ఇతర కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

ఈ కారులోని స్టాండర్డ్ ఫీచర్లను గమనిస్తే, ముందు వరుసలో పవర్ విండోస్, టిల్ట్-అడ్జస్టబల్ స్టీరింగ్, మాన్యువల్ ఏసి మరియు హీటర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

టాప్-ఎండ్ వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, వెనుక సీట్లలో హెడ్‌రెస్ట్, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ మరియు ఆల్ 4 పవర్ విండోస్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి ఇగ్నిస్ చూడటానికి మినీ ఎస్‌యూవీలా కనిపించే ఓ పొడవైన-హ్యాచ్‌బ్యాక్ కారుగా రూపొందించబడింది. ఈ కారు లోపల మంచి క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. పొడవైన డ్రైవర్లకు కూడా అనుకూలంగా ఉండేలా ఉంటుంది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

ఇంజన్ విషయానికి వస్తే, ఈ చిన్న కారులో పెద్ద 1.2 లీటర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83 పిఎస్ శక్తిని మరియు 4200 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో రానున్న మారుతి సుజుకి ఇగ్నిస్

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరు 20.89 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం మారుతి ఇగ్నిస్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.89 లక్షల నుండి రూ.7.30 లక్షల వరకూ ఉన్నాయి.

MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

Most Read Articles

English summary
Maruti Suzuki To Launch Ignis In New Black Colour Paint Scheme, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X