Just In
- 10 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి-టొయోటా జేవీ నుండి క్రాసోవర్ మోడల్; బడ్జెట్‌ను తగ్గించడానికే..
భారతంలోనే అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరియు జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటాలు చేతులు కలిపి భారత మార్కెట్లో క్రాస్ బ్రాండింగ్ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

కార్ల తయారీలో పెట్టుబడులను తగ్గించడానికి మరియు లాభాలను పెంచడానికి ఇరు కంపెనీల మధ్య కుదిరిన జాయింట్ వెంచర్ ప్రకారం, మారుతి సుజుకి తయారు చేసిన మోడళ్లను టొయోటా రీబ్యాడ్జ్ చేసుకొని, ఆ కార్లలో స్వల్ప మార్పులు చేర్పులు చేసి విక్రయిస్తోంది.

ఇలా ఈ రెండు బ్రాండ్ల నుండి ఇప్పటికే బాలెనో - గ్లాంజా, విటారా బ్రెజ్జా - అర్బన్ క్రూయిజర్ వంటి క్లోనింగ్ మోడళ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, ఇప్పుడు వీటికి భిన్నంగా ఈ రెండు కంపెనీలు కలిసి సంయుక్తంగా కొన్ని మోడళ్లను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
MOST READ:టీవీఎస్ అపాచీ సిరీస్ బైకుల కొత్త ధరల జాబితా ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో ఇక్కడ చూడండి

ఈ జేవీ నుండి రానున్న సరికొత్త వాహనాలు ఇదివరకటి రీబ్యాడ్జ్ వెర్షన్ల మాదిరిగా కాకుండా, పూర్తిగా కొత్త ప్లాట్‌ఫ్లామ్‌పై రానున్నాయి. తాజాగా, టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన నివేదికల ప్రకారం, మారుతి సుజుకి-టొయోటా జేవీ ఓ కొత్త క్రాస్ఓవర్ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ మోడల్‌ను డి-22 అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు.

ఈ క్రాసోవర్ మోడల్ సెడాన్‌లోని ఫీచర్లను మరియు ఎస్‌యూవీలో సౌకర్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్ కలిగి ఉండి, నాణ్యమైన డ్రైవింగ్ అనుభూతిని మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని అంచనా.
MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

మారుతి-టొయోటా జేవీ నుండి రానున్న కొత్త క్రాసోవర్ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే, దీని ఇంజన్ ఆప్షన్ల వివరాల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఈ కారును కర్ణాటకలో ఉన్న టొయోటా కార్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సమాచారం.

అయితే, ఈ క్రాసోవర్ మోడల్ తయారీలో ఉపయోగించబోయే అనేక రకాల విడి భాగాలు మారుతి సుజుకి సప్లయర్ల నుండే సేకరించనున్నట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు. ఫలితంగా, ఈ కొత్త మోడల్‌ను అత్యంత సరసమైన ధరకే మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

మరోవైపు, మారుతి సుజుకి వైటిబి అనే కోడ్‌నేమ్‌తో ఓ కొత్త కాంపాక్ట్ క్రాస్ఓవర్ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ కొత్త కాంపాక్ట్ క్రాసోవర్‌ను బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా తయారు చేసే అవకాశం ఉంది.

వాస్తవానికి మారుతి సుజుకి, టొయోటా కంపెనీలకు క్రాసోవర్ మోడళ్లు కొత్తేమీ కాదు. గతంలో టొయోటా తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఎతియోస్ మోడల్ ఆధారంగా ఎతియోస్ క్రాస్ అనే క్రాసోవర్ మోడల్‌ను విక్రయించిన సంగతి తెలిసిదే. అలాగే ప్రస్తుతం మారుతి సుజుకి ఈ విభాగంలో ఎస్-క్రాస్ అనే క్రాసోవర్ మోడల్‌ను కూడా విక్రయిస్తోంది.
MOST READ:నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు

క్రాసోవర్ విభాగంలో ఇరు కంపెనీలకు ఉన్న అనుభవాన్నంతా కలిపి ఓ సరికొత్త మోడల్‌ను తయారు చేయాలని రెండు కంపెనీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ కంపెనీలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Source: Team BHP