సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. కేవలం కొత్త కార్ల విషయంలోనే కాకుండా, సెకండ్ హ్యాండ్ (ప్రీ-ఓన్డ్) కార్ల విషయంలో కూడా ఈ కంపెనీ అద్భుతమైన ఫలితాలను కనబరుస్తోంది.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

మారుతి సుజుకి కంపెనీకి చెందిన ప్రీ-ఓన్డ్ కార్ బ్రాండ్ మారుతి సుజుకి ట్రూ వ్యాల్యూ, సెకండ్ హ్యాండ్ కార్ల విభాగంలో 40 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థను స్థాపించిన 20 ఏళ్లలో కంపెనీ ఈ అమ్మకాల మైలురాయిని సాధించింది.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

మారుతి సుజుకి ట్రూ వాల్యూ సంస్థను 2001లో ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ 4 మిలియన్ల ప్రీ-ఓన్డ్ కార్లను రీటైల్ చేసింది. ట్రూ వాల్యూ ప్రస్తుతం దేశంలోని 268 నగరాల్లో 550 అవుట్‌లెట్లతో విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

మారుతి సుజుకి తమ ట్యూ వ్యాల్యూ ఛానెల్ ద్వారా కస్టమర్ల నుండి కొనుగోలు చేసే మరియు కస్టమర్లకు విక్రయించే వాహనాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. కంపెనీ నిర్దేశించిన అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాతనే, కస్టమర్ల నుండి పాత వాహనాలను కొనుగోలు చేయటం చేస్తారు.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

అలా కస్టమర్ల నుండి కొనుగోలు చేసిన వాహనాలను మరియు ఎక్సేంజ్ ఆఫర్ క్రింద మార్పిడి చేసుకున్న వాహనాలను మారుతి సుజుకి సర్వీస్ ఇంజనీర్లు క్షుణ్ణంగా తనిఖీ చేసి, అవసరమైన మార్పులు చేర్పులు చేసి పూర్తి కండిషన్‌లోకి తెచ్చిన తర్వాత ట్రూ వ్యాల్యూ అవుట్‌లెట్ల ద్వారా ప్రీ-ఓన్డ్ కార్లుగా విక్రయిస్తారు.

MOST READ:ట్రయంఫ్ టైగర్ 900 బైక్ సొంతం చేసుకున్న మలయాళీ స్టార్

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

మారుతి సుజుకి ట్రూ వ్యాల్యూ అవుట్‌లెట్ల ద్వారా ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ ఓ క్వాలిటీ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తుంది. కాబట్టి, వినియోగదారులు ఎలాంటి సంకోచం లేకుండా వాడిన కార్లను కొనుగోలు చేయవచ్చు. మారుతి ట్రూ వాల్యూ నుండి కొనుగోలు చేసే కార్లపై ఒక సంవత్సరం వారంటీ మరియు 3 ఉచిత సర్వీసులను కూడా అందిస్తారు.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో మారుతి సుజుకి హవా..

మారుతి ట్రూ వాల్యూ తనిఖీ చేసిన ప్రీ-ఓన్డ్ కార్లను విక్రయించడంతో పాటుగా భీమా, క్రెడిట్ అసిస్టెన్స్ మరియు యాక్ససరీలకు సంబంధించిన సేవలను కూడా అందిస్తుంది. మారుతి సుజుకి బ్రాండ్‌కు ఉన్న విస్తృతమైన నెట్‌వర్క్ కారణంగా, ట్రూ వాల్యూపై వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యం మరియు విశ్వాసం ఏర్పడింది.

MOST READ:మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

Most Read Articles

English summary
Maruti Suzuki True Value Sold Over 40 Lakh Pre-owned Cars In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X