మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 2021 నెలలో కంపెనీ యొక్క వాహనాల ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని మారుతి సుజుకి పేర్కొంది.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

మార్చి 2021తో పోలిస్తే, ఏప్రిల్ 2021లో వాహనాల ఉత్పత్తి 7 శాతం తగ్గి 1,59,955 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. గతేదాడి సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 2021లో కంపెనీ ఎలాంటి కార్లను ఉత్పత్తి చేయలేదు.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

కాగా, దానికి ముందు సంవత్సరం ఇదే సమయంలో, అంటే ఏప్రిల్ 2020లో మారుతి సుజుకి మొత్తం 1,72,433 వాహనాలను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. గత నెలలో 29,056 యూనిట్ల ఆల్టో, ఎస్-ప్రెసో కార్లను ఉత్పత్తి చేయగా, మార్చి 2021లో వీటి సంఖ్య 28,519 యూనిట్లుగా ఉంది.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

ఇకపోతే వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో మరియు స్విఫ్ట్ డిజైర్ మోడళ్ల ఉత్పత్తి మార్చి 2021లో 95,186 యూనిట్లుగా ఉంటే, ఏప్రిల్ 2021లో ఇది 83,432 యూనిట్లకు పడిపోయింది.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

యుటిలిటీ వాహనం విభాగంలో మారుతి సుజుకి జిప్సీ, ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఎక్స్‌ఎల్ 6 వాహనాలను అందిస్తోంది. మార్చి 2021లో ఈ మోడళ్ల ఉత్పత్తి సంఖ్య 32,421 యూనిట్లుగా ఉంటే, ఏప్రిల్ 2021లో ఇవి 31,059 యూనిట్లుగా నమోదయ్యాయి.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

తేలికపాటి వాణిజ్య వాహన (లైట్ కమర్షియల్ వెహికల్) విభాగంలో మారుతి సుజుకి విక్రయిస్తున్న సూపర్ క్యారీ మోడల్ గడచిన ఏప్రిల్ 2021 నెలలో 2,390 యూనిట్లను ఉత్పత్తి చేయగా, మార్చి 2021లో 2,397 యూనిట్లును ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వివరించింది.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

గతేడాది కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రకటించిన సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 2020లో కంపెనీ ఎటువంటి వాహనాలను ఉత్పత్తి చేయలేదని మారుతి సుజుకి పేర్కొంది. కాబట్టి ఏప్రిల్ 2020 మరియు ఏప్రిల్ 2021 మధ్య ఉత్పత్తి పరిమాణాన్ని పోల్చడంలో ఎలాంటి అర్థం లేదు.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

తగ్గిన మారుతి లాభాలు; నాల్గవ త్రైమాసికంలో రూ.1241 కోట్లు

మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్‌ఐ) లిమిటెడ్ గడచిన ఆర్థిక సంవత్సరంలో చివరి (నాలుగో) త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. గడచిన 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ సమగ్ర నికర లాభం 6.14 శాతం తగ్గి రూ.1,241.1 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

మారుతి సంస్థపై కరోనా పంజా; ఏప్రిల్ 2021లో 7 శాతం తగ్గిన వాహన ఉత్పత్తి

సంస్థ డైరెక్టర్ల బోర్డు 2020-21 సంవత్సరానికి తన వాటాదారులకు రూ.45 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,322.3 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Maruti Suzuki Vehicle Production Down By 7 Percent In April 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X