హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా ఈ విభాగంలోనే అత్యధికంగా అమ్మడయ్యే కారు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తున్నప్పటికీ, ఇది ప్రతి నెలా అద్భుతమైన అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

తాజాగా, మారుతి సుజుకి విడుదల చేసిన జూన్ 2021 నెల అమ్మకాల గణాంకాల ప్రకారం, విటారా బ్రెజ్జా గత నెలలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ వెన్యూ మోడల్ అమ్మకాలను అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

అంతేకాకుండా, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఈ సంవత్సరం మొదటి అర్థ భాగంలో కూడా తన ఆధిక్యాన్ని కొనసాగించింది మరియు ఇతర పోటీదారుల కంటే ముందంజలో ఉంది.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

ఇక అమ్మకాల విషయానికి వస్తే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ సంవత్సరం మొదటి భాగంలో కంపెనీ 60,183 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇదే సమయంలో హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు 54,675 యూనిట్లుగా ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

జూన్ 2020తో పోలిస్తే, జూన్ 2021లో ఈ రెండు మోడళ్ల అమ్మకాలు సుమారు 50 శాతం పెరిగాయి. అలాగే, ఈ విభాగంలో పాపులర్ అయిన మరొక కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ అమ్మకాల విషయానికి వస్తే, ఈ సంవత్సరం మొదటి భాగంలో ఈ మోడల్ అమ్మకాలు 46,247 యూనిట్లుగా నమోదయ్యాయి.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

మొత్తంగా చూసుకుంటే, ఈ ఏడాది ప్రధమార్థంలో అమ్మకాల పరంగా మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మొదటి స్థానంలోనూ, హ్యుందాయ్ వెన్యూ రెండవ స్థానంలోనూ ఉండగా, టాటా నెక్సాన్ మూడవ స్థానంలో ఉంది.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

ప్రస్తుతం మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 1.5-లీటర్, కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్‌తో పాటుగా కంపెనీ కంపెనీ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కాంపిటీటర్ అయిన హ్యుందాయ్ వెన్యూ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. పెట్రోల్ ఇంజిన్‌లో 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూని ఓవర్‌టేక్ చేసిన మారుతి విటారా బ్రెజ్జా; నెంబర్ వన్ ఎస్‌యూవీ..!

కాగా డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 118 బిహెచ్‌పి పవర్ మరియు 171 ఎన్ఎమ్ టార్క్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌లను ఉత్పత్తి చేస్తాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki Vitara Brezza Overtakes Hyundai Venue Sales In The First Half Of 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X