మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, వివిధ వర్గాల కస్టమర్ల కోసం చిన్న కార్ల నుండి ప్రీమియం కార్ల వరకూ విభిన్న మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాంపాక్ట్ కార్ నుండి 7-సీటర్ ఎస్‌యూవీ వరకూ మారుతి సుజుకి వివిధ వాహన విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తోంది.

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

దశాబ్ధాల చరిత్ర, విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ మరియు అందుబాటులో ఉండే వాహన ధరలతో మారుతి సుజుకి భారతీయుల మదిని దోచుకుంటోంది. ఈ లక్షణాలతో మారుతి సుజుకి భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్‌గా అవతరించింది. ఈ బ్రాండ్ ఇప్పుడు తమ వినియోగదారుల మరిన్ని కొత్త కార్లను తీసుకువచ్చే పనిలో బిజీగా ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మారుతి సుజుకి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విటారా బ్రెజ్జా అనే మోడల్‌ను విక్రయిస్తోంది.

MOST READ:కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా కొనసాగుతోంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి అనేక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు రావటంతో, ఈ విభాగంలో పోటీ పెరిగి విటారా బ్రెజ్జా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

ఈ నేపథ్యంలో, భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు మారుతి సుజుకి మరొక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి నుండి రాబోయే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని "వైటిబి" అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నట్లు సమాచారం.

MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా రానున్న ఈ కొత్త ఎస్‌యూవీని కంపెనీ యొక్క పాపులర్ హార్టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే అవకాశం ఉంది. ఇందులో 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్ పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఈ కొత్త మోడల్ కూప్ లేదా క్రాస్ఓవర్ డిజైన్‌ను పోలి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బాలెనోలో ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫామ్, ఫీచర్స్ మరియు ఇంజన్‌లను ఉపయోగించడం ద్వారా ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను తగ్గించాలని మారుతి భావిస్తోంది.

MOST READ:భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

మారుతి సుజుకి బాలెనో ఆధారంగా వస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ!

మారుతి సుజుకి స్విఫ్ట్‌తో పోలిస్తే, బాలెనో అతి తక్కువ సమయంలో మార్కెట్లో మంచి పనితీరు కనబరిచింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో బాలెనో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో, బాలెనో ప్లాట్‌ఫామ్‌పై వచ్చే ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో బలమైన ఉత్పత్తిగా నిలిచే అవకాశం ఉంది.

Source: Cartoq

Most Read Articles

English summary
Maruti Suzuki Working On Baleno Based Compact SUV, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X