ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మళ్ళీ మొదలైపోయింది. ఇప్పుడు చాలా దేశాలతో పాటు భారతదేశంలో కూడా అధికంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో కూడా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, న్యూ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది.

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

రోజు రోజుకి ఎక్కువమంది ఈ వైరస్ భారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా సంక్రమణ రోజు రోజుకి అధికంగానే ఉంది.

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

కరోనా వైరస్ సంక్రమణను తగ్గించడానికి ఇటీవల ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. దీని ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో కరోనాకు వ్యతిరేకంగా హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

దీని ప్రకారం ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ఒంటరిగా కూడా కారు నడుపుతున్నట్లైతే వారికి కూడా పేస్ మాస్క్ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ సమయంలో మాస్క్ తప్పని సరి కావున అందరూ తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలి అని హైకోర్టు అభిప్రాయపడింది.

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

ప్రస్తుతం ఒంటరిగా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలి, లేకుంటే జరిమానా విధించబడుతుంది. ఇంతకుముందు ఒంటరిగా ప్రయాణించేవారికి పేస్ మాస్క్ అవసరం లేదు, అయితే వైరస్ సంక్రమణ అధికంగా ఉంది కావున తప్పనిసరి.

ఒక వ్యక్తికి టీకా వేసుకున్నా, వేసుకోకపోయినా పేస్ మాస్క్ ధరించి తీరాలి అని ఆదేశాలు జరీ చేయబడ్డాయి. కోవిడ్‌కు వ్యతిరేకంగా సురక్షితంగా ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాల సలహాలను ఆయన తెలిపారు.

MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగినప్పుడు, డ్రైవర్ తరచుగా తన కిటికీని మూసివేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మాస్క్ లేకుండా ఒంటరిగా డ్రైవ్ చేస్తే వారికీ 500 రూపాయల జరిమానాను విధించబడుతుంది.

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

ఒకే డ్రైవర్ ఉన్నప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత నియమాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి హక్కు ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు లేదా ప్రభుత్వ వాహనాల్లో అందరికీ మాస్క్ ఉండాలని నిర్ణయించింది.

MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి.. లేకుంటే?

ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లోనే ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మాస్క్ ధరించడం అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ సమయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి.

Most Read Articles

English summary
Mask In Car Compulsory Even If Driving Alone Says Delhi High Court. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X