మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ప్రముఖ బ్రిటీష్ సూపర్‌కార్ బ్రాండ్ మెక్‌లారెన్, భారత మార్కెట్లో మూడు కొత్త సూపర్ కార్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. మెక్‌లారెన్ 720ఎస్, 720ఎస్ స్పైడర్, అర్టురా అనే మూడు సూపర్ కార్లను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూడు సూపర్ కార్ల ధరలు, ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్య పొందిన అతికొద్ది ఎలైట్ సూపర్ కార్ తయారీదారులలో మెక్‌లారెన్ కూడా ఒకటి. ఈ బ్రాండ్ గతంలో కొన్ని అద్భుతమైన సూపర్ కార్లను తయారు చేసింది మరియు ఇప్పుడు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. మెక్లారెన్ ప్రస్తుతం 720ఎస్, 720ఎస్ స్పైడర్, 765 ఎల్‌టి, మరియు జిటి మోడళ్లను అనేక అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది.

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

చాలా కాలం నుండి, మెక్‌లారెన్ భారత మార్కెట్ నుండి దూరంగా ఉంది. అయితే, ఇదే విభాగంలో మెక్‌లారెన్ ప్రధాన పోటీదారులు అయిన ఫెరారీ మరియు లంబోర్ఘిని వంటి బ్రాండ్లు మాత్రం భారతదేశంలో తమ సూపర్ కార్లను విక్రయిస్తూనే ఉన్నాయి. అయితే, దేశీయ మార్కెట్లో మెక్‌లారెన్ కార్లు కావాలనుకునే సంపన్నులు మాత్రం వాటిని కార్నెట్ ద్వారా లేదా డైరెక్ట్ ఇంపోర్ట్ మార్గం ద్వారా దిగుమతి చేసుకునేవారు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

భారతదేశంలో ఉన్న మెక్‌లారెన్ కార్లను చేతివేళ్లపై లెక్కించవచ్చు. వీటి మార్కెట్ పరిమాణం చాలా పరిమితమే అయినప్పటికీ, ఇవి మార్కెట్లో అద్భుతమైన ఆకర్షణగా ఉంటాయి. మెక్‌లారెన్ కార్లు కేవలం లుక్స్ పరంగా మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా దాని పోటీదారుల కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటాయి.

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ఇటీవలి కాలంలో భారత సూపర్ కార్ మార్కెట్ చాలా మెరుగుపడింది. భారతదేశంలో సూపర్ కార్ యజమానుల సంఖ్య కూడా పెరిగుతోంది. ఈ పరిస్థితులను పరిగణిలోకి తీసుకున్న మెక్‌లారెన్ ఇప్పుడు భారత మార్కెట్లోకి అధికారిక ప్రవేశించాలని చూస్తోంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

గడచిన 2020లో, మెక్‌లారెన్ ముంబైలో ఒక డీలర్‌షిప్‌ను ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. ఈ డీలర్‌షిప్ ద్వారా ఇది దేశవ్యాప్తంగా దాని పరిమిత కస్టమర్ డిమాండ్‌ను తీర్చగలరని భావించారు.

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కాగా, ఇప్పుడు మెక్‌లారెన్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం గురించి బ్రాండ్ యొక్క వెబ్‌సైట్‌లో నిర్ధారించబడింది. ఈ విషయంలో మెక్‌లారెన్ నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బ్రాండ్ యొక్క వెబ్‌సైట్‌లోని కాన్ఫిగరేటర్ విభాగం ఇప్పుడు కాన్ఫిగరేషన్ వర్తించే దేశాలలో ఒకటిగా భారతదేశాన్ని కూడా జాబితా చేయటాన్ని చూస్తుంటే, ఇది స్పష్టమవుతుంది.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ఈ కాన్ఫిగరేటర్‌లో మెక్‌లారెన్ 765 ఎల్‌టి మోడల్‌ను లిస్ట్ చేయలేదు. కాబట్టి, ఇది భారత మార్కెట్లోకి రాదని తెలుస్తోంది. ఒ ఎల్‌టి మోడల్‌ను కాన్ఫిగర్ చేయడానికి ప్రయత్నిస్తే, స్క్రీన్‌పై "ఈ మోడల్ భారతదేశంలో అందుబాటులో లేదు" అనే ఒక సందేశం కనిపిస్తుంది.

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కానీ, అదే సమయంలో మెక్‌లారెన్ 720ఎస్, 720ఎస్ స్పైడర్ మరియు ఆర్టురో మోడళ్లను భారత మార్కెట్ కోసం కాన్ఫిగర్ చేయగలుగుతున్నాము. వీటిలో 720ఎస్ మరియు 720ఎస్ స్పైడర్ మోడళ్లలో రెండు చాలా పోలికలు ఉంటాయి. కాకపోతే, ఇందులో అతిపెద్ద తేడా ఏమిటంటే 720ఎస్ హార్డ్-టాప్‌ను కలిగి ఉంటుంది మరియు 720ఎస్ స్పైడర్ మోడల్ కన్వర్టిబుల్ టాప్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

మెక్‌లారెన్ 720ఎస్ మరియు 720ఎస్ స్పైడర్ మోడళ్లు రెండూ కూడా ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఇందులోని 3,994సిసి, ట్విన్-టర్బో వి8 ఇంజన్ గరిష్టంగా 710 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కారు కేవలం 2.9 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కేవలం 7.8 సెకన్లలోనే 0-200 కి.మీ వేగాన్ని సాధిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 341 కి.మీ.

మెక్‌లారెన్ నుండి మూడు కొత్త సూపర్ కార్లు; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

మెక్‌లారెన్ అర్టురా సూపర్ కార్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 671 బిహెచ్‌పి శక్తిని మరియు 720 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి హైబ్రిడ్ డ్రైవ్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారుకి సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Most Read Articles

English summary
McLaren To Launch 720S, 720S Spider And Artura Super Cars In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X