మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

ప్రస్తుతం భారత ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ మార్కెట్లో పోటీ అధికమైంది. దేశంలో ప్రీమియం కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీలు సరసమైన ధలకే తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి.

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

ఇటీవలే బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ ఎంట్రీ లెవల్ 3-సిరీస్ లిమోసిన్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే. కాగా, ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ కూడా తమ పాపులర్ ఎంట్రీ లెవల్ ఏ-సిరీస్ ఓ లిమోసిన్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ మోడల్‌ను మార్చ్ 25, 2021వ తేదీన కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది. ఈ కారు తక్కువ ధరను కలిగి ఉండి, విలువకు తగినట్లునే అత్యుత్తమమైన ఫీచర్లను ఆఫర్ చేయవచ్చని అంచనా. ఈ కారుని రెండు రూపాల్లో విడుదల చేయనున్నారు.

MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్‌కి ఓవర్‌స్పీడింగ్ ఛలాన్!?

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

ఇందులో ఒకటి స్టాండర్డ్ మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ కాగా మరొకటి దాని పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఏఎమ్‌జి ఏ35 మోడల్ కావచ్చని సమాచారం. మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఏ-క్లాస్ లిమోసిన్ మోడల్‌ను ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో ప్రోగ్రెసివ్ అనే ఒక్క వేరియంట్లో మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

అయితే, ఇది పెట్రోల్ (ఏ200) మరియు డీజిల్ (ఏ200డి) ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. కాగా ఏఎమ్‌జి ఏ35 మోడల్‌ను మాత్రం కేవలం టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తోనే అందించనున్నారు.

MOST READ:2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ పెట్రోల్ వెర్షన్‌లో 1.4-లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 161 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

ఇకపోతే, డీజిల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ కారులో 2.0-లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 147 హెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

అలాగే, పెర్ఫార్మెన్స్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఏ35 కారులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 302 హెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0-100 కి.మీ వేగాన్ని చేరుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లుగా ఉంటుంది.

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ ముందు భాగంలో సొగసైన గ్రిల్, ఎల్‌ఇడి హెడ్‌లైట్లు మరియు ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. సి-పిల్లర్ వరకు ఇది చూడటానికి ఎ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఉంటుంది. ఆ తర్వాత నుండి ఇది చక్కగా జోడించిన బూట్ రూమ్ మరియు రూఫ్ డిజైన్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..

మార్చ్ 25న మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ విడుదల - వివరాలు

కొత్త ఏ-క్లాస్ కారులో పానరోమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ కెమెరా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.40 లక్షల రేంజ్‌లో ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Mercedes-Benz India To Launch A-Class Limousine On March 25, 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X