EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారత మార్కెట్లో మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ లో EQE ఎలక్ట్రిక్ సెడాన్ మరియు EQB ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లిస్ట్ చేసింది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌ లో జరిగిన అంతర్జాతీయ ఆటోమొబైల్ షో (IAA) లో Mercedes Benz కొన్ని రకాల ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. కాగా, కంపెనీ ఇప్పుడు తన భారతీయ వెబ్‌సైట్‌లో ఈ కార్లలో కొన్నింటిని జాబితా చేసింది. సమాచారం ప్రకారం, కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఈక్యూఈ (EQE) ఎలక్ట్రిక్ సెడాన్ మరియు ఈక్యూబి (EQB) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను జాబితా చేసింది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

అయితే, ప్రస్తుతానికి ఇవి కేవలం వెబ్‌సైట్ లో మాత్రమే కనిపించనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లు ఇప్పట్లో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. భారతదేశంలో తమ కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే ఆలోచన ఇప్పట్లో లేదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి భారతదేశంలో లభిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈక్యూసి (EQC).

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

మరో రెండేళ్ల తర్వాత (అంటే 2023 తర్వాత) భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు Mercedes Benz సూచించింది. అయితే, భారతదేశంలో అప్పటి మార్కెట్ డిమాండ్ మరియు ఎలక్ట్రిక్ కార్ల కోసం సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

భారతదేశంలోని కస్టమర్‌లు Mercedes Benz యొక్క కొత్త ఉత్పత్తుల గురించి సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్ లో ప్రదర్శించిందని నిపుణులు భావిస్తున్నారు. Mercedes Benz EQE కారు EVA2 (ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్ పై నిర్మించిన కంపెనీ ఎలక్ట్రిక్ సెడాన్.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

దీని డిజైన్ Mercedes EQ సిరీస్ కార్ల మాదిరిగానే ఉంటుంది. సెడాన్ డిజైన్‌లో, ఈ కారు కూప్ స్టైల్ రూఫ్‌ ను కలిగి ఉంటుంది మరియు ఇది మంచి స్పోర్టీ లుక్‌ని ఇస్తుంది. స్లిమ్ వీల్ ఆర్చెస్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్, స్లిమ్ రియర్ ప్యానెల్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ దీని ప్రత్యేకతలు. క్యాబిన్ స్పేస్ పరంగా చూస్తే, ఈ ఎసక్ట్రిక్ కారు ప్రస్తుత తరం CLS సెడాన్ ను పోలి ఉంటుంది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

ఈ బ్రాండ్ రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ కార్ల లోపలి భాగంలో అనేక గొప్ప ఫీచర్లు మరియు పరికరాలు జోడించబడ్డాయి. ఈ కార్లలో కంపెనీ కొత్త MBUX హైపర్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఆఫర్ చేయనుంది. అంతే కాకుండా, ఆటోమేటిక్ ఫ్రంట్ డోర్ మరియు రియర్ వీల్ స్టీరింగ్ వంటి కొత్త ఫంక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

Mercedes Benz EQB కి వస్తే, ఇది 2021 షాంఘై ఆటో షోలో ప్రదర్శించబడిన Mercedes Benz GLB యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ గా ఉంటుంది.. మ్యూనిచ్ ఆటో షోలో ప్రదర్శించబడింది EQB ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అనేది యూరోపియన్ మోడల్, ఇది యూరోప్ మరియు ఆసియాలోని మార్కెట్లలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. ఇందులో భారతీయ మార్కెట్ కూడా ఉండే అవకాశం ఉంది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

Mercedes Benz EQB ఎలక్ట్రిక్ కారు డిజైన్ స్టాండర్డ్ GLB మాదిరిగానే ఉంటుంది. దీని ముందు భాగంలో డ్యూయల్ స్లాట్ గ్లోస్ బ్లాక్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు షార్ప్ ఫ్రంట్ బంపర్ ఉంటుంది. కారులోని అన్ని లైట్లు ఎల్ఈడిలే ఉంటాయి. ఈ మోడల్‌లో కూడా, కంపెనీ 10.3 ఇంచ్ MBUX డిస్‌ప్లేను ఆఫర్ చేస్తోంది. Mercedes Benz GLB మాదిరిగానే ఇది కూడా 7 సీట్ల ఎంపికతో రానుంది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

పవర్ విషయానికి వస్తే, Mercedes Benz EQE ఎలక్ట్రిక్ సెడాన్ కారులో 90 kWh బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించారు. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 660 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ కారు ముందు మరియు వెనుక యాక్సిల్స్ ఒక్కొక్కటి చొప్పున రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 215 kW శక్తిని మరియు 530 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

ఇక Mercedes Benz EQB ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ కారులో 66.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 419 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 288 Bhp శక్తిని మరియు 521 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

భారత్‌లో Mercedes Benz EQC ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి (Mercedes Benz EQC) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 1.04 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా ఇక్కడికి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఫలితంగా, దీని ధర కూడా అధికంగా ఉంటుంది.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

Mercedes Benz EQC ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద ఒక్కొక్క ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇవి రెండూ కలిపి గరిష్టంగా 405 బిహెచ్‌పి పవర్‌ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తాయి.

EQE మరియు EQB ఎలక్ట్రిక్ కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన Mercedes Benz

ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం చేశారు. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Mercedes benz lists eqe and eqb electric cars on its indian website details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X