మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన మరో కొత్త కార్ 'మేబ్యాక్ ఎస్680'; పూర్తి వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క వాహనాలకు ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా కంపెనీ ఎప్పటికప్పుడు అనేక కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు కొత్త మేబ్యాక్ ఎస్ 680 అల్ట్రా లగ్జరీ సెడాన్‌ను ఆవిష్కరించింది.

కొత్త 2022 మెర్సిడెస్ మేబ్యాక్ చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రీమియం డ్యూయల్ టోన్ ఫినిషింగ్ మరియు పెద్ద మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎక్కువ మొత్తంలో క్రోమ్ లభిస్తుంది.

ఈ కారు యొక్క లోపలి భాగంలో మొత్తం 5 స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే కాగా, మరొకటి 12.8 ఇంచెస్ ఓఎల్ఇడి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్. కొత్త మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 680 ఇప్పుడు మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ తన కొత్త మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 680 సెడాన్ తప్ప వేరే ఇతర వివరాలను వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఈ లగ్జరీ కారు ఆటోమాటిక్ గా డోర్స్ ని కంట్రోల్ చేయగలదు. డోర్మాన్ ఫీచర్‌తో, డ్రైవర్ కారు లోపల కూర్చున్నప్పుడు డోర్ ఓపెన్ చేసి మూసివేయవచ్చు.

ఈ లగ్జరీ కారులో మంచి అప్డేటెడ్ ఫీచర్స్ ఉంటాయి. అవి అడ్జస్టబుల్ బకెట్ సీటు, సీటుతో లెగ్ రెస్ట్, ఎగ్జిక్యూటివ్ రియర్ సీట్, వుడ్ ట్రిమ్, ట్రే టేబుల్, షాంపైన్ కూలర్, ఎల్'సిడి డిస్ప్లే, లాంగ్ కన్సోల్ వంటి ఫీచర్లు. ఇవన్నీ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఈ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 680 కారులో అదే 6.0-లీటర్ వి 12 ఇంజన్ అప్‌గ్రేడ్ చేయబడి ఉంటుంది. కావున ఇది ఎక్కువ బిహెచ్‌పి పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే స్టాండర్డ్ మోడల్ లోని 6.0-లీటర్ వి 12 ఇంజన్ 630 బిహెచ్‌పి మరియు 1,000 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త మోడల్ యొక్క ఇంజన్ శక్తి మరియు టార్క్ గణాంకాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ తన EQA, EQB, EQ మరియు EQS ఫ్లాగ్‌షిప్ సెడాన్‌లను EQ బ్రాండ్ క్రింద విడుదల చేయనుంది. 2025 నాటికి 25 కొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేయడానికి కంపెనీ సిద్దమైంది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో విడుదల కానున్నాయి.

మెర్సిడెస్-మేబ్యాక్ 680 కారు మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ పై ఆధారపడింది. ఈ లగ్జరీ మెర్సిడెస్-మేబ్యాక్ 680 కారు ప్రస్తుత తరానికి అనుకూలంగా ఉండే అత్యంత అధునాతన లక్షణాలను కలిగి ఉంది. ఈ కొత్త లగ్జరీ కారు వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








