పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఏజి కూడా ఎలక్ట్రిక్ కార్ల బాట పట్టింది. వచ్చే 2025 నుండి తాము కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత తరం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసిఇ) శక్తితో నడిచే వాహనాల ఉత్పత్తి / జీవిత కాలం ముగిసే సమయానికి వాటిని దశలవారీగా తొలగిస్తామని కంపెనీ తెలిపింది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి చార్జ్‌పై 1000 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేసే ఓ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌పై పనిచేస్తోంది. కంపెనీ ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎక్స్ఎక్స్ [EQXX] పేరుతో ఈ కాన్సెప్ట్ కారును తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారు పరీక్షా దశ (టెస్టింగ్ ఫేజ్)లో ఉంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూ [EQ] పేరుతో కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ను తయారు చేసింది. పలు అంతర్జాతీయ మార్కెట్లలో మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. మనదేశంలో కూడా ఈక్యూసి పేరుతో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అందిస్తోంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

అయితే, 2025 నుండి మెర్సిడెస్ బెంజ్ విడుదల చేయబోయే ఏదైనా కొత్త మోడల్ ఇకపై పూర్తిగా మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనం అవుతుంది. ఈ దశాబ్దం చివరి నాటికి, మెర్సిడెస్ బెంజ్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

మెర్సిడెస్ బెంజ్ 2025 నాటికి, మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫామ్‌లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వీటిలో MB.EA (మీడియం నుండి పెద్ద సైజు ప్యాసింజర్ కార్లు), AMG.EA (పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్) మరియు VAN.EA (వివిధ ప్రయోజనాల కోసం తయారు చేసే ఎలక్ట్రిక్ వ్యాన్లు మరియు తేలికపాటి వాణిజ్య వాహనాలు) ఉన్నాయి.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

వచ్చే ఏడాదిలో (2022లో) మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే మార్కెట్లోని ప్రతి ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనూ ఓ ఉత్పత్తిని అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. కంపెనీ విక్రయిస్తున్న ప్రతి మోడల్‌కు బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

మెర్సిడెస్ బెంజ్ దాని భాగస్వాములతో కలిసి ఎనిమిది గిగాఫ్యాక్టరీలను సృష్టించాలని మరియు 200 గిగావాట్ల కంటే ఎక్కువ బ్యాటరీ సెల్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఐరోపాలో బ్యాటరీ సెల్స్ అభివృద్ధి మరియు ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 5,30,000 ఎసి మరియు డిసి ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎక్స్ఎక్స్ ఎలక్ట్రిక్ కారును 2022లో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వాహనంలో భారీ బ్యాటరీ ప్యాక్‌ అమర్చబడి ఉంటుంది. ఈ కారు మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇదే ఈ విభాగంలోనే అత్యధిక రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించనుంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

ప్రస్తుతం అమెరికన్ కార్ కంపెనీ టెస్లా అందిస్తున్న మోడల్ ఎస్ ప్లాయిడ్ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది మరియు ఇది పూర్తి చార్జ్‌పై 647 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. కాగా, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎక్స్ఎక్స్ కారులో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ఇది పూర్తి చార్జ్‌పై 620 మైళ్ల (సుమారు 997 కి.మీ) రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

పూర్తి చార్జ్‌పై 1000 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు!

మెర్సిడెస్ బెంజ్ లిథియం-అయాన్ సెల్స్ నుండి వీలైనంత ఎక్కువ శక్తిని బయటకు తీయడం ద్వారా మరింత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోంది. మెర్సిడెస్ ఫార్ములా 1 బృందంతో కలిసి కంపెనీ ఈ సరికొత్త కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేస్తోంది. టీజర్‌లోని విజన్ ఇక్యూఎక్స్ఎక్స్ కాన్సెప్ట్‌ను గమనిస్తే, కంపెనీ గత 2013లో ప్రదర్శించిన విజన్ గ్రాన్ టురిస్మో కాన్సెప్ట్ మాదిరిగా కనిపిస్తుంది.

Most Read Articles

English summary
Mercedes-Benz Teases EQXX Electric Vehicle Concept; Claim 1000 km Per Charge. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X