Just In
- 38 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 48 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 57 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీవైపు మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగానే, కంపెనీ తాజాగా తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ'ని ఆవిష్కరించింది. ఇది కంపెనీ యొక్క ఈక్యూ బ్రాండ్ క్రింద వస్తున్న రెండవ కొత్త మోడల్ కావటం విశేషం.

మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే ఈక్యూ లైనప్‌లో ఈక్యూసి అనే ఎస్‌యూవీని విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, ఈ కొత్త ఈక్యూఏ కారుని మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్రాసోవర్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది యూరప్‌లో విడుదల కానుంది.

సెకండ్ జనరేషన్ జిఎల్ఏ అండర్‌పిన్నింగ్స్‌ని ఉపయోగించి ఈక్యూఏ కారును తయారు చేశారు. ఇందులో సిగ్నేచర్ 'బ్లాక్ ప్యానెల్' ఈక్యూ రేడియేటర్ గ్రిల్‌తో పాటు ముందు మరియు వెనుక భాగంలో పూర్తి ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఉంటుంది. వెనుక భాగంలో బూట్ డోర్ పొడవునా బ్రేక్ లైట్ ఉంటుంది. రాత్రివేళల్లో ఇది మెరుగైన విజిబిలిటీని కల్పిస్తుంది.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

ఈ కారులో మరో ప్రధాన ఆకర్షణగా, ఇందులోని రోస్ గోల్డ్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ గురించి చెప్పుకోవచ్చు. ఈ 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై లోప్రొఫైల్ టైర్లను అమర్చారు. ఇక ఫ్రంట్ అండ్ సైడ్ డిజైన్‌లో సింపుల్ బాడీ లైన్స్‌తో మినమలిస్టిక్ డిజైన్ ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారులోని క్యాబిన్ చూడటానికి జిఎల్ఏ క్యాబిన్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇందులో అల్లాయ్ వీల్స్‌కి మ్యాచ్ అయ్యే కలర్‌తో కారులో అక్కడక్కడా రోస్ గోల్డ్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. దీని డాష్‌బోర్డ్‌లో డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మరొకటి మరియు ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం.
MOST READ:మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

ఈ ఎలక్ట్రిక్ కారును ప్రోగ్రెసివ్, ఎలక్ట్రిక్ ఆర్ట్ మరియు ఏఎమ్‌జి లైన్ అనే మూడు వేరియంట్లలో ఆఫర్ చేయనున్నారు. ఇందులోని ఏఎమ్‌జి పెర్ఫార్మెన్స్ వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లో రెండు మోటార్లు ఉంటాయి, ఇవి రెండూ కలిసి 268 పిఎస్ పవర్‌ను జనరేట్ చేస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 250గా పిలువబడే ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్‌లో ఒకే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, దీనిని ముందు భాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది 190 పిఎస్ పవర్‌ను మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 8.9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఇందులో 66.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, పూర్తి చార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 426 కి.మీ. రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఇందులో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల లాంగ్ రేంజ్ వేరియంట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ధృవీకరించింది.

ఛార్జింగ్ సామర్ధ్యాల విషయానికొస్తే, ఇల్లు లేదా పబ్లిక్ 11 కిలోవాట్ల ఏసి ఛార్జర్ సాయంతో ఈ కారు బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయటానికి 5 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. అదే 100 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించినట్లయితే, ఈ బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈక్యూసి అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. భారతదేశంలో దీనికి సంబంధించిన మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ఇటీవలే పేర్కొంది.

భారత్‌లో బెంజ్ ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ ఈక్యూఏ కారును కూడా ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నాటికి ఇది మన మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.