భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ ఇండియా గత డిసెంబర్ నెల అమ్మకాలలో భారీ వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో అమ్మకాల పరంగా తమకు 2020 సంవత్సరం బాగా కలిసొచ్చిందని, సంవత్సరంలో అత్యధికంగా రిటైల్ అమ్మకాలను సాధించామని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

డిసెంబర్ 2020లో కంపెనీ అత్యధికంగా 4,010 యూనిట్లను విక్రయించించి, వార్షిక అమ్మకాల పరంగా 33 శాతం వృద్ధిని సాధించింది. అమ్మకాలు 2020 సంవత్సరంలోనే అత్యధికమైన నెలవారీ అమ్మకాలని కంపెనీ తెలిపింది.

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

గత డిసెంబర్ నెలలో కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలలో 3430 యూనిట్లు హెక్టర్ ఎస్‌యూవీ మోడల్ నుండే వచ్చాయని, మిగిలిన వాటిలో గ్లోస్టర్, జిఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. గతేడాది 2019లోని అమ్మకాలతో పోలిస్తే 2020లో మొత్తం అమ్మకాలు 77 శాతం పెరిగినట్లు ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రకటించింది.

MOST READ:ఊపందుకున్న హీరో మోటోకార్ప్ సేల్స్.. భారీగా పెరిగిన డిసెంబర్ అమ్మకాలు

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ ఎమ్‌జి గ్లోస్టర్ మార్కెట్లో విడుదలైన రెండు నెలల్లోనే 1085 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు ఎమ్‌జి మోటార్ పేర్కొంది. అలాగే, 2020 క్యాలెండర్ ఇయర్‌లో ఎమ్‌జి హెక్టర్ మరియు జిఎస్ ఈవీలు వరుసగా 25,000 యూనిట్లు మరియు 1243 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

డిసెంబర్ 2020 నెల అమ్మకాల గణాంకాలతో పాటుగా, ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ మోడళ్ల బుకింగ్ నెంబర్లను కూడా ప్రకటించింది. గత నెలలో ఎమ్‌జి హెక్టర్ కోసం 5000 యూనిట్లు మరియు జిఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం 200 యూనిట్ల బుకింగ్స్ నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

కొత్త సంవత్సరంలో భారత మార్కెట్ కోసం ఎమ్‌జి మోటార్ కొత్త ఉత్పత్తులను ప్లాన్ చేస్తోంది. వీటిలో 7-సీటర్ వెర్షన్ ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ మరియు పెట్రోల్ పవర్డ్ ఎమ్‌జి జిఎస్ ఎస్‌యూవీలు ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ మోడల్‌ను సూపర్ మరియు షార్ప్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హెక్టర్ ప్లస్‌లో 6 సీట్లు (2+2+2) మాత్రమే ఉన్నాయి. కాగా, కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వెర్షన్‌లో, స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీలో గమనించినట్లుగా వెనుక వరుసలో కనిపించే బెంచ్ సీట్‌ను హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ మద్య వరుసలో అమర్చున్నారు. మార్పు మినహా ఇందులో వేరే మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

MOST READ:క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న ఎంజి జెడ్‌ఎస్ పెట్రోల్ : పూర్తి వివరాలు

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

ఏడాది హెక్టర్ ప్లస్ 7-సీటర్‌తో పాటుగా కంపెనీ పెట్రోల్ వెర్షన్ ఎమ్‌జి జిఎస్ ఎస్‌యూవీని కూడా మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఎమ్‌జి పెట్రోల్ పవర్డ్ జిఎస్ ఎస్‌యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఏడాది మొదటి త్రైమాసికం నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

హెక్టర్ ధర కంటే జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ ధర తక్కువగా ఉంటుందని కంపెనీ గతంలో పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో హెక్టర్ ప్రారంభ ధర రూ.12.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే, కొత్త జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ ధర అంత కన్నా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇది విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు నిస్సాన్ కిక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:ఇక బ్యాటరీ చార్జింగ్ సమస్యే ఉండదు; కొత్తగా 500, రెండేళ్లలో 10,000 చార్జింగ్ స్టేషన్లు

భారత్‌లో చైనా కార్ల జోరు.. డిసెంబర్‌లోనే అత్యధికం..

కస్టమర్లు ఎమ్‌జి బ్రాండ్ అందిస్తున్న బెస్ట్ క్లాస్ ఉత్పత్తులను స్వీకరించడాన్ని కొనసాగిస్తుండటంతో గడచిన సంవత్సరాన్ని తాము అత్యుత్తుమ ఫలితాలతో ముగించామని ఎమ్‌జి మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రాకేశ్ సిదానా అన్నారు. ఫలితాలు తమకు కొత్త సంవత్సరంపై మరింత భరోసాని, ఉత్సాహాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
MG Motor India Registers Highest-ever Monthly Retail Sales In December 2020. Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X