Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్చిలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యూవీలు; టాప్‌లో క్రెటా
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. సరసమైన ధరలు, బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్, విశిష్టమైన డిజైన్స్ మరియు వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లతో ఈ విభాగంలోని వాహనాలను కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

దేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇటీవలి కాలంలో, ఈ విభాగంలోకి అనేక కొత్త మోడళ్ల కూడా ప్రవేశించాయి. గత నెలలో ఈ సెగ్మెంట్ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మార్చిలో హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడై అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా 12,640 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 2020లో ఈ మోడల్ అమ్మకాల సంఖ్య కేవలం 6,706 యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ సమయంలో క్రెటా అమ్మకాలు ఏకంగా 88 శాతం పెరిగాయి. క్రెటాలో నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దీని అమ్మకాలు జోరందుకున్నాయి.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

ఇక ఇందులో రెండవ స్థానంలో ఉన్నది కియా మోటార్స్ విక్రయిస్తున్న సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ. కియా సెల్టోస్ మార్కెట్లోకి విడుదలైన కొత్తల్లో ఈ మోడల్ మార్కెట్‌ను పాలించింది, కానీ ఇప్పుడు దాని డిమాండ్ స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. గత నెలలో మొత్తం 10,557 సెల్టోస్ కార్లు అమ్ముడయ్యాయి. మార్చి 2020లో ఇవి 7,466 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో సెల్టోస్ అమ్మకాలు 41 శాతం పెరిగాయి.
Rank | Toyota | Mar'21 | Mar'20 | Growth (%) |
1 | Hyundai Creta | 12,640 | 6,706 | 88 |
2 | Kia Seltos | 10,557 | 7,466 | 41 |
3 | MG Hector | 4,720 | 1,402 | 237 |
4 | Maruti S-Cross | 2,535 | 0 | - |
5 | Mahindra Scorpio | 2,331 | 40 | 5728 |
6 | Tata Harrier | 2,284 | 632 | 261 |
7 | Tata Safari | 2,148 | 0 | - |
8 | Jeep Compass | 1,360 | 163 | 734 |
9 | Mahindra XUV500 | 603 | 9 | 6600 |
10 | Renault Duster | 252 | 150 | 68 |

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి హెక్టర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మార్చి 2021లో మొత్తం 4,720 యూనిట్ల హెక్టర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మార్చి 2020లో ఇవి 1,402 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో హెక్టర్ అమ్మకాలు 237 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
MOST READ:బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కారుణ్య రామ్

నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మారుతి సుజుకి విక్రయిస్తున్న ఎస్-క్రాస్ అమ్మకాలు గత నెలలో 2,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన ఫిబ్రవరి 2021తో పోలిస్తే, మార్చి 2021లో మారుతి ఎస్-క్రాస్ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. ఇకపోతే, మహీంద్రా స్కార్పియో అమ్మకాలు గడచిన సంవత్సరం ఇదే సమయంలో 40 యూనిట్లుగా ఉంటే, గత నెలలో 2,331 యూనిట్లు అమ్ముడయ్యాయి.

గడచిన మార్చి 2021లో టాటా హారియర్ అమ్మకాలు 2,284 యూనిట్లుగా నమోదు కాగా, గడచిన సంవత్సరం ఇదే సమయంలో ఇవి 632 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో హారియర్ అమ్మకాలు 261 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన టాటా సఫారీ అమ్మకాలు గత నెలలో 2,148 యూనిట్లుగా ఉన్నాయి.
MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీ అమ్మకాలు గత నెలలో 1,360 యూనిట్లుగా ఉన్నాయి. గడచిన సంవత్సరం ఇదే సమయంలో ఇవి 163 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్ 603 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మార్చి 2020లో కేవలం 9 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఇకపోతే, ఈ జాబితాలో పదవ స్థానంలో ఉన్నది రెనాల్ట్ డస్టర్. గత నెలలో మొత్తం 252 యూనిట్ల డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో కేవలం 150 డస్టర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సమయంలో డస్టర్ అమ్మకాలు 68 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి
Source: Autopunditz