భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ (MINI), భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కారు అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. మినీ ఇండియా, దేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన 'మినీ ఎలక్ట్రిక్' (MINI Electric) కోసం నిన్న (అక్టోబర్ 29 న) అధికారికంగా బుకింగ్ లను ప్రారంభించింది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

ప్రారంభ బ్యాచ్ లో భాగంగా కంపెనీ కేవలం 30 యూనిట్ల మినీ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 2 గంటల్లోనే అన్ని యూనిట్లూ పూర్తిగా బుక్ అయిపోయాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా, మినీ ఎలక్ట్రిక్ కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

మినీ ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మరియు కంపెనీ దీని కోసం లక్ష రూపాయల టోకెన్ అమౌంట్ తో బుకింగ్ లను ప్రారంభించింది. ఆన్‌లైన్ లో ఈ కారు కోసం బుకింగ్ లను ప్రారంభించిన 2 గంటల వ్యవధిలోనే మొత్తం 30 యూనిట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

ఈ ట్రెండ్ చూస్తుంటే, దేశంలో సాధారణ ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. కాగా, మినీ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు వచ్చే నెలల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన స్పష్టమైన తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

మినీ ఎలక్ట్రిక్ డిజైన్ మినీ కూపర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయినప్పటికీ, ఇందులో కొన్ని చిన్న మార్పులు చేయబడ్డాయి. ఈ మార్పులలో అత్యంత ప్రముఖమైనది ఫేక్ ఫ్రంట్ గ్రిల్, ఇది కారును ఏరోడైనమిక్‌గా చూపించడంలో సహాయపడుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌కి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి, కంపెనీ దీని పెయింట్ స్కీమ్‌లలో కొన్ని ఆకర్షణీయమైన యల్లో కలర్ యాక్సెంట్స్ ను ఉపయోగించింది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

ఇంకా ఇందులో మినీ ఎలక్ట్రిక్ బ్యాడ్జ్ కూడా అమర్చబడి ఉంటుంది. ఈ కారులో ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన గుండ్రటి హెడ్‌లైట్‌లు, యల్లో కలర్ రిమ్‌లతో కూడిన కొత్త 17 ఇంచ్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌తో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ఈ కారు యొక్క అన్ని పిల్లర్లను కూడా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేశారు, ఇది కారుకు మంచి కాంట్రాస్ట్‌ లుక్ ని ఇస్తుంది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

మినీ ఎలక్ట్రిక్ కారు ఒక 3 డోర్ కూప్ మోడల్. ఈ కారును నడుపుతున్నప్పుడు ఇదొక హై-స్పీడ్ గో-కార్ట్ అనుభూతిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు తక్షణ టార్క్‌ ను అందిస్తుంది మరియు సున్నా ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఫలితంగా, ఈ ఎలక్ట్రిక్ కారులో ఎగ్జాస్ట్ పైప్ కనిపించదు. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 270 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను మరియు 184 హార్స్ పవర్ ల శక్తిని జనరేట్ చేస్తుంది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మినీ ఎలక్ట్రిక్ కారు కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఓవరాల్ గా ఈ మినీ ఎలక్ట్రిక్ కారు ఓ ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 32.6 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి చార్జ్ పై ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 270 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

మినీ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు రంగులలో లభిస్తుంది. వీటిలో వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే మరియు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి, మినీ ఇండియా ఇంకా ఈ ఎలక్ట్రిక్ కారు ధరను వెల్లడించలేదు. కంపెనీ దీని ధర మరియు ఇతర వివరాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ప్రకటించవచ్చని సమాచారం.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా ఆ తర్వాతి నెలల్లో డెలివరీ చేసే అవకాశం ఉంది. మినీ ఇండియా ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయించనుంది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

అంతేకాకుండా, ఇది సింగిల్ వేరియంట్ గా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభించే అవకాశం ఉంది. మినీ ఎలక్ట్రిక్ సిబియూ యూనిట్ కావడం కారణంగా, ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లపై భారతదేశం అనుసరిస్తున్న అధిక దిగుమతి సుంఖాల వలన ఈ కారు ధర కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైపోయిన ఎలక్ట్రిక్ కార్..

మినీ కూపర్ ఎస్ఈ మోడల్ ను కంపెనీ 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది మరియు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ కారును అందుబాటులోకి తీసుకువస్తోంది. భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ పెరుగుతున్న దృష్ట్యా, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో పరిమిత సంఖ్యలో విడుదల చేసింది.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
Mini electric car sold out in india in just two hours details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X