హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq: వీడియో

సాధారణంగా కార్లు అనేవి ఒకప్పుడు ప్రయాణానికి మాత్రమే వినియోగించే వారు అనే విషయం అందరికి తెలుసు. అయితే కాలక్రమంలో కార్లను రేసులలో మరియు ఆఫ్ రోడింగ్ వంటి వాటి కోసం కూడా ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచమే అభివృద్ధివైపు పరుగులు పెడుతోంది. కావున ఇటీవల విడుదలవుతున్న కార్లలో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటుంది.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

Skoda కంపెనీ యొక్క Kodiaq SUV ఏకంగా ఒక మినీ హెలికాప్టర్‌ను తీసుకెళ్లే సామర్థ్యంతో అభివృద్ధి చేయబడింది. దీనికి సంబందించిన ఒక వీడియో కూడా కంపెనీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. Kodiaq SUV అనేది Skoda కంపెనీ యొక్క ఒక మోడల్. ఈ వీడియోలో Kodiaq SUV ని చూడవచ్చు. ఈ వీడియోలోని SUV ఇంకా విడుదల కాలేదు. SUV త్వరలో లాంచ్ చేయబడుతుంది.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

కొత్త కోడియాక్ SUV కి ప్రజలను ఆకర్షించడానికి ఒక కొత్త ప్రచార వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది.ఈ వీడియోలోని SUV ఇంకా విడుదల కాలేదు. ఈ కొత్త Kodiaq ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్‌లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తుంది.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

భారతదేశంలో విడుదల చేయనున్న కొత్త Skoda Kodiaq SUV బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ SUV విడుదలైన తరువాత 2022 జనవరిలో డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV చూడటానికి చాలా ఆకర్శణీయంగా ఉంటుంది.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

భారతీయ మార్కెట్లో Skoda కంపెనీ విడుదల చేయనున్న కొత్త Kodiaq SUV ని ఎక్కువగా ఆకర్శించడానికి ఈ వీడియో చాలా ఉపయోగాపడుతుంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఇది అత్యధిక బరువును తట్టుకోగల సామర్త్యాన్ని కలిగి ఉంటుందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక మినీ హెలికాప్టర్ ని ఈ ఎస్‌యూవీ మోయగలదు.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

హ్యుందాయ్ గతంలో కొత్త తరం క్రెటా కారును చాలా కష్టతరమైన నిర్మాణంతో చూపించే వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు ఇదే వరుసలో Skoda (స్కోడా) ఇప్పుడు Kodiaq SUV యొక్క స్థిరత్వాన్ని చూపించడానికి కొత్త వీడియోను విడుదల చేసింది. కొత్త 2021 కొడియాక్ SUV మరింత ఆకర్షణీయమైన కారు మోడల్‌గా అభివృద్ధి చేయబడింది.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

2021 Kodiaq SUV అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, బటర్‌ఫ్లై స్టైల్ గ్రిల్ మరియు అప్‌డేట్ చేయబడిన బంపర్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త కారు వెనుక భాగంలో కూడా గణనీయమైన మార్పులు చేయబడ్డాయి. అంతే కాకుండా ఇందులో రూఫ్ రైల్, షార్క్ ప్యాడిల్ సిస్టమ్‌తో యాంటెన్నా, కొత్త స్టైల్ అల్లాయ్ వీల్ మరియు స్పాయిలర్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

2021 Kodiaq యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో డ్యూయల్-స్పోక్ అల్లాయ్ వీల్, కొత్త స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో కొత్త డిజిటల్ యాక్టివేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు వున్నాయి.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్ రూఫ్, వర్సటైల్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, వర్సటైల్ ఎయిర్ ప్యాక్, యాంబియంట్ ఎలక్ట్రిక్ లైటింగ్, ప్రీమియం స్పీకర్, వెంటిలేటెడ్ మరియు మసాజ్ సీట్లు, ఆర్మ్ రెస్ట్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉంటాయి.

కొత్త Skoda Kodiaq SUV లో 2.0-లీటర్ డిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 7-స్పీడ్ DSG డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

హెలికాప్టర్‌నే మోయగల కెపాసిటీ కలిగిన Skoda Kodiaq వీడియో

స్కోడా ఆటో ఇండియా నాన్ మెట్రో సిటీల్లో కాంపాక్ట్ వర్క్‌షాప్‌లను ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ కాంపాక్ట్ వర్క్‌షాప్‌లు, ఈ ప్రదేశాలలో సేల్స్ మరియు డీలర్ బ్రాంచ్‌లతో కలిపి, కస్టమర్ల సర్వీస్ అవసరాలను తీరుస్తాయి. స్కోడా ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 30 కాంపాక్ట్ వర్క్‌షాప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవి సాధారణ నిర్వహణ మరియు సాధారణ సేవా అవసరాలను చూసుకుంటాయి. మొత్తానికి కంపెనీ కస్టమర్లకు మంచి సేవను అందించానికి చూస్తోంది. కంపెనీ త్వరలో విడుదల చేయనున్న కొత్త Kodiaq SUV మంచి ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Mini helicopter lands on the roof of a new skoda kodiaq suv video details
Story first published: Tuesday, October 5, 2021, 11:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X