Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

దేశంలో నిరతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కారణంగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాల కోసం వెతుకున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ప్రధానంగా వినిపించే ప్రత్యామ్నాయ ఇంధనాలు రెండే రెండు. అందులో మొదటిది సిఎన్‌జి మరియు రెండవది ఎలక్ట్రిక్ పవర్. మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే, వీటిని సుదూర ప్రయాణాల కోసం ఉపయోగించడంలో అనేక సవాళ్లు కూడా లేకపోలేదు. దీంతో కస్టమర్లు మొదటి ప్రత్యామ్నాయమైన సిఎన్‌జి వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

భారతదేశంలో అత్యధికంగా సిఎన్‌జి వాహనాలను విక్రయించే ఏకైక సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). ఈ విభాగంలో అత్యధిక స్థాయిలో సిఎన్‌జి వాహనాలను విక్రయిస్తూ మార్కెట్ ను శాసిస్తున్న ఈ దేశీయ కంపెనీ ఇప్పటికీ 1.20 లక్షల యూనిట్లకు సిఎన్‌జి వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. మారుతి సుజుకి గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో దాదాపు 1.62 లక్షల సిఎన్‌జి కార్లను విక్రయించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

ప్రస్తుతం, మారుతి సుజుకి నుండి అత్యధిక సంఖ్యలో సిఎన్‌జి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో తమ ప్రోడక్ట్ లైనప్ లో మరిన్ని కొత్త (సిఎన్‌జి) CNG మోడళ్లను ప్రవేశపెట్టాలని మారుతి సుజుకి యోచిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు తగ్గుతున్న డీజిల్ కార్ల అమ్మకాల నేపథ్యంలో, భవిష్యత్తులో సిఎన్‌జి కార్లకు డిమాండ్ భారీగా పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

భారత మార్కెట్లో మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే సిఎన్‌జితో నడిచే కార్లను విక్రయిస్తున్నాయి. త్వరలోనే ఈ జాబితాలోకి టాటా మోటార్స్ కూడా చేరే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు కంపెనీలతో పోల్చుకుంటే, మారుతి సుజుకి సిఎన్‌జి కార్లకే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. కానీ, కంపెనీ మాత్రం ఆ డిమాండ్ కి తగినట్లుగా సిఎన్‌జి వాహనాలను కస్టమర్లకు అందించలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటికీ, లక్ష యూనిట్లకు పైగా సిఎన్‌జి వాహనాల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయి.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

ఆటోమొబైల్ మార్కెట్ ను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలలో సెమీ కంట్కటర్ చిప్ షార్టేజ్ కూడా ఒకటి. ఈ ఎలక్ట్రానిక్ చిప్ షార్టేజ్ కారణంగా కంపెనీ తమ వాహనాలకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటి ఉత్పత్తిని మాత్రం గరిష్ట స్థాయికి పెంచలేకపోయింది. దీని కారణంగా కంపెనీకి 2.80 లక్షల ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీటిలో దాదాపు 1.20 లక్షల ఆర్డర్‌లు సిఎన్‌జి మోడళ్ల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వీటి వాటా కంపెనీ మొత్తం పెండింగ్ ఆర్డర్‌లలో 43 శాతం ఉంటుంది.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మార్కెట్లో 7 సీట్ల ఎర్టిగా ఎమ్‌పివి యొక్క సిఎన్‌జి వెర్షన్ కి అధిక డిమాండ్ ఉంది. మొత్తం పెండింగ్ ఆర్డర్లలో దాదాపు 50 శాతం, అంటే సుమారు 60,000 యూనిట్ల సిఎన్‌జి ఎర్టిగా మోడళ్లు డెలివరీ కోసం వేచి ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో వ్యాగన్ఆర్ ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి మోడల్ కోసం దాదాపు 36,000 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి రెండే కాకుండా, కంపెనీ యొక్క ఇతర మోడళ్లలో పెట్రోల్ కి ప్రత్యామ్నాయంగా సిఎన్‌జి రూపంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో విక్రయించబడుతున్నాయి.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

వీటిలో ప్రైవేట్ కస్టమర్‌ల కోసం విక్రయించబడిన ఆల్టో, ఎస్-ప్రెస్సో మరియు ఈకో సిఎన్‌జి వాహనాలు ఉండగా, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం విక్రయించబడే సూపర్ క్యారీ ఎల్‌సివి (మినీ పికప్ ట్రక్), టూర్ ఎస్ మరియు టూర్ ఎమ్ మోడళ్లు ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఏప్రిల్ మరియు నవంబర్ 2021 మధ్య కాలంలో మారుతి సుజుకి తన సిఎన్‌జి కార్ల విక్రయాలలో దాదాపు 56 శాతం వృద్ధిని సాధించింది. ఈ సమయంలో కంపెనీ 1,36,357 యూనిట్ల సిఎన్‌జి వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (ఏప్రిల్ మరియు నవంబర్ 2020) వీటి సంఖ్య 87,634 యూనిట్లుగా ఉంది.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

మారుతి సుజుకి 2021 ఆర్థిక సంవత్సరంలో 1.62 లక్ష యూనిట్ల సిఎన్‌జి వాహనాలను విక్రయించింది. కాగా, ప్రస్తుత 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.50 లక్షల యూనిట్ల సిఎన్‌జి వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ సిఎన్‌జి వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే, మరిన్ని కొత్త సిఎన్‌జి వాహనాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

Maruti Suzuki నుండి 1.20 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాల డెలివరీ పెండింగ్!

ప్రస్తుతం, మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న మొత్తం 15 మోడళ్లలో కేవలం ఏడు మోడళ్లలో మాత్రమే సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. వీటిలో ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, టూర్స్, ఎర్టిగా మరియు సూపర్ క్యారీ మోడళ్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 2021 సెలెరియో మోడల్ లో కూడా సిఎన్‌జి వెర్షన్ ను విడుదల చేయడానికి కంపనీ ప్లాన్ చేస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం సిఎన్‌జి కార్ల విభాగంలో దాదాపు 85 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండి, ఈ విభాగంలో ఆదిపత్యాన్ని చలాయిస్తోంది.

Most Read Articles

English summary
More than 1 lakh cng models delivery pending from maruti suzuki details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X