మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

మోటారిస్టులకు భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ తీపికబురు వెల్లడించింది. వచ్చే అక్టోబర్ 31, 2021 వరకు వాహన పత్రాల చెల్లుబాటును పొడిగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయం కారణంగా గడువు ముగిసిన వాహన పత్రాల చెల్లుబాటు కాలాన్ని మరింత పొడిగించాలని ఎమ్ఓఆర్‌టిహెచ్ నిర్ణయించింది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాల చెల్లుబాటును అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదివరకు పత్రాల చెల్లుబాటు ఈ గడువు సెప్టెంబర్ 30, 2021 వరకు ఉండేది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

మోటార్ వాహనాల చట్టం, 1988 మరియు కేంద్ర మోటార్ వాహనాల నియమాల 1989 కి సంబంధించిన డాక్యుమెంట్ల చెల్లుబాటు పొడిగింపు గురించి మార్చి 2019 లో, కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసినదే.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

గత ఏడాది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ (అన్ని రకాలు), డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా ఇతర సంబంధిత డాక్యుమెంట్లను ప్రజలు కరోనావైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వలన, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు మరియు సకాలంలో వాటిని రెన్యువల్ చేయించుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో, గతేడాది మార్చ్ నుండి ఈ పత్రాల గడువును పలుమార్లు పొడగిస్తూ వచ్చారు. ఇదివరకటి నోటిఫికేషన్ ప్రకారం, ఈ పత్రాల గడువు సెప్టెంబర్ 30, 2021 లేదా అంతకు ముందు ముగియాల్సి ఉంది. కాగా, ఇప్పుడు ఈ పత్రాల చెల్లుబాటును అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించబడింది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

ఈ నేపథ్యంలో, తమ వాహన పత్రాలను పునరుద్ధరించుకోలేని వారు, ఈ పత్రాలను అక్టోబర్ 31 లోపు పునరుద్ధరించవచ్చు. ఈ వాహన పత్రాల జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటుగా మోటారు వాహనాల చట్టం 1988 మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 కిందకు వచ్చే అన్ని పత్రాలు ఉంటాయి.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

ఇదిలా ఉంటే, ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ భారత రోడ్లపై పాత మరియు అధిక కాలుష్యం కలిగించే వాహనాలను తొలగించడానికి స్వచ్చంద వాహన స్క్రాపేజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసినదే. పర్యావరణానికి మరియు ప్రజలు హాని కలిగించే పాత వాహనాలను రోడ్లపై తిరగకుండా చేసి, తద్వారా రహదారుల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని పరిచయం చేసింది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

ఇలా పాత వాహనాలను స్క్రాప్ చేసిన వినియోగదారులకు కార్ కంపెనీలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, సదరు వాహన యజమానికి కొనుగోలు చేసే కొత్త వాహనంపై అదనపు తగ్గింపులను మరియు రోడ్డు పన్నులో రాయితీలను అందించడం జరుగుతుంది. ఈ వెహికల్ స్క్రాపేజ్ విధానం కింద, మంత్రిత్వ శాఖ ప్రోత్సాహకాల జాబితాను కూడా విడుదల చేసింది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం, "పాత వాహనం యొక్క స్క్రాపింగ్‌కు ప్రోత్సాహకంగా, వాహన యజమానులకు స్క్రాపింగ్ ఏజెన్సీ నుండి ఓ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది, దాని ఆధారంగా కొత్త వాహనంపై రోడ్డు పన్ను నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది." సమాచారం ప్రకారం, ఈ రాయితీ ప్రైవేట్ వాహనాలకు 25 శాతం వరకు మరియు రవాణా లేదా వాణిజ్య వాహనాల కోసం 15 శాతం వరకు ఉంటుంది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

ఇదిలా ఉంటే, పాత వాహనాలను పూర్తిగా తొలగించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ కొత్త వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద, కేంద్ర ప్రభుత్వం పాత వాహనాల (15 ఏళ్లకు పైబడినవి) యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ మరియు ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను భారీగా పెంచనుంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 1, 2022 వ తేదీ నుండి, 15 సంవత్సరాల కంటే పాతబడిన బైక్, కారు లేదా బస్సు/వాణిజ్య వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజు ప్రస్తుత ఫీజు కన్నా సుమారు 8 రెట్లు ఎక్కువగా ఉండనుంది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

అంటే, వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి, కొత్త ఫీజు రేట్లు అమలులోకి రానున్నాయన్నమాట. ఇకపై 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 300 కి బదులుగా, రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒకవేళ మీరు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కారును నడుపుతుంటే, రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మోటారిస్టులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

బస్సులు లేదా ట్రక్కుల వంటి 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ మరియు వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల రెన్యువల్ కూడా ప్రస్తుత ధర కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండనున్నాయి. ఇలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు సుమారు రూ. 10,000 నుండి రూ. 12,500 వరకూ ఉంటుంది. దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ. 10,000 వరకూ మరియు నాలుగు చక్రాల వాహనాలకు రూ. 40,000 వరకూ ఖర్చు అవుతుంది.

Most Read Articles

English summary
Morth extends vehicles documents validity till 31 october 2021 details
Story first published: Friday, October 15, 2021, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X