భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రత్యేకించి 7-సీటర్ ఎస్‌యూవీ విభాగంలో డిమాండ్ జోరుగా ఉంటోంది. ఇటీవలి కాలంలో ఈ విభాగంలోకి అనేక కొత్త మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కజార్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

మనదేశంలో ఇప్పటికే టొయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి ఎస్‌యూవీలు 7 సీటర్ విభాగంలో ఉన్నాయి. కాకపోతే, వీటి ధరలు అందరికీ అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు సరసమైన ధరకే 7-సీటర్ వాహనాలను ప్రవేశపెట్టడం ప్రారంభించాయి.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

ఒకవేళ మీరు సరసమైన ధరకే ఓ మంచి 7 సీటర్ ఎస్‌యూవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆప్షన్లు ఏంటో తెలుసుకుందాం రండి. ఈ కథనంలో రూ.20 లక్షలకు దిగువన లభించే 7 సీటర్ ఎస్‌యూవీల వివరాలను చూద్దాం రండి.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

టాటా సఫారి

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమ కొత్త తరం టాటా సఫారి ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ యొక్క ఐకానిక్ సఫారి నేమ్‌ప్లేట్‌ను తిరిగి ఈ మోడల్ ద్వారా పునఃప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ యొక్క పాపులర్ హారియర్ మిడ్-సైజ్ (5-సీటర్) ఎస్‌యూవీ ఆధారంగా ఈ సఫారీ ఎస్‌యూవీని తయారు చేశారు.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

కొత్త 2021 టాటా సఫారి ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.0 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో స్టాండర్డ్ వెర్షన్ 7-సీటర్ సఫారి ప్రారంభ ధర రూ.14.99 లక్షలుగా ఉంటుంది. ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్లు 6-సీటర్ ఆప్షన్‌తో కూడా లభిస్తాయి.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

హ్యుందాయ్ అల్కాజార్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న క్రెటా మిడ్-సైజ్ (5-సీటర్) ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని రూపొందించిన సరికొత్త 7-సీటర్ అల్కజార్ ఎస్‌యూవీని కంపెనీ ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేసింది. హ్యుందాయ్ అల్కజార్ మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో 6-సీటర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

హ్యుందాయ్ అల్కజార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి శక్తిని మరియు 191 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్‌ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఆల్కాజార్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.16.30 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.16.53 లక్షల నుండి ప్రారంభమవుతాయి.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

మహీంద్రా ఎక్స్‌యూవీ500

ఈ విభాగంలో ఎప్పటి నుండో అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ప్రారంభ ధర రూ.15.52 లక్షలుగా ఉంటోంది. ప్రముఖ దేశీయ కంపెనీ మహీంద్రా నుండి లభిస్తున్న ఈ 7-సీటర్ ఎస్‌యూవీలో 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 155 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అండ్ మహీంద్రా నుండి లభిస్తున్న మరొక 7-సీటర్ ఎస్‌యూవీ స్కార్పియో. ఈ మోడల్ కూడా చాలా కాలంగా భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవలే ఇందులో ఓ కొత్త వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ప్రారంభ ధర రూ.12.31 లక్షలుగా ఉంటుంది. ధర పరంగా చూసుకుంటే, మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీనే ఈ విభాగంలో అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీగా ఉంటుంది.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 319 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతానికి ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదు. కాపపోతే, భవిష్యత్తులో రాబోయే నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా స్కార్పియోలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆశించవచ్చు.

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

ఎమ్‌జి హెక్టర్ ప్లస్

ఇక ఈ జాబితాలో చివరిది ఎమ్‌జి హెక్టర్ ప్లస్. చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ (5-సీటర్) ఎస్‌యూవీ హక్టర్ ఆధారంగా ఈ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని తయారు చేశారు. ఇది కూడా 7 మరియు 6-సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అవి: 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (143 బిహెచ్‌పి / 250 ఎన్‌ఎమ్) మరియు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ (170 బిహెచ్‌పి / 350 ఎన్‌ఎమ్).

భారత్‌లో లభించే అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీలు: సఫారి, అల్కజార్, హెక్టర్ ప్లస్..

వీటిలోని పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డిసిటి లేదా సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ ఇంజన్ మాత్రం కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ యొక్క పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.13.62 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.15.03 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి.

గమనిక: పైన పేర్కొన్న అన్ని ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, జూన్ 2021 నాటికి)

Most Read Articles

English summary
Most Affordable 7 Seater SUVs In India: Safari, Alcazar, XUV500, Hector Plus And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X