భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన యుగం ప్రారంభమయ్యింది. కావున ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకంటే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. ఈ కారణంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి.

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ఆదరణ పొందటానికి ప్రధాన కారణం పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా. అయితే ప్రస్తుతం ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్టికల్ లో దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

టాటా టిగోర్ ఈవి (Tata Tigor EV):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాధరణ పొందిన టాటా మోటార్స్ రెండు వేర్వేరు ఎలక్ట్రిక్ వాహనాలను రూ. 15 లక్షలలోపు అందించే ఏకైక కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందింది. కంపెనీ యొక్క టాటా టిగోర్ ఈవి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టాటా టిగోర్ సబ్-4-మీటర్ కాంపాక్ట్ సెడాన్ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు మూడు వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఇందులోని టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 12.99. ఈ ఎలక్ట్రిక్ కారు దాదాపుగా 306 కిమీ పరిధిని అందిస్తుంది. కావున ఇది ఎక్కువమంది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపిక. అందువల్ల ఎక్కువమంది దీనిని కొనుగోలు చేస్తుంటారు.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

టాటా నెక్సాన్ ఈవి (Tata Nexon EV):

టాటా మోటార్స్ యొక్క టాటా నెక్సాన్ కంపెనీ యొక్క రెండవ మోడల్. ఇది భారతదేశంలో తక్కువ ధరకు లభింహే ఎలక్ట్రిక్ వాహనాలలో ఒకటి. ఇది ఎంజి మోటార్ కంపెనీ యొక్క జెడ్ఎస్ ఈవి కంటే కూడా దాదాపు రూ. 6 లక్షల నుంచి 7 లక్షలు తక్కువగా ఉంటుంది.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు చాలా అరకు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాకను కలిగి ఉంటుంది. అంతే కాకుండా అది మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. టాటా నెక్సాన్ 30.2 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 312 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

ఎంజి జెడ్ఎస్ ఈవి (MG ZS EV):

భారతీయ మార్కెట్లో ఎంజి మోటార్ కంపెనీ విడుదల చేసిన రెండవ ఉత్పత్తి ఈ ఎంజి జెడ్ఎస్ ఈవి (MG ZS EV). ఇది విడుదలైనప్పటినుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ యొక్క ఆదరణ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఈ కారుని ఎక్కువమంది కొనుగోలుదారులు కొనుగోలు చేస్తున్నారు.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

MG ZS EV చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది 44.5kWh మోటార్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీతో జత చేయబడి ఉంటుంది. ఇది దాదాపుగా 340 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమైన ఎలక్ట్రిక్ కారు.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ (Hyundai Kona Electric):

హ్యుందాయ్ కంపెనీ యొక్క కోనా ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ కార్లకంటే కూడా ఎక్కువ ధర కలిగి ఉంటుంది.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

కొత్త హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో మంచి ఇంటీరియర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇది మంచి పరిధిని అందిస్తుంది. కావున ఇది భారతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందుతుంది.

భారత్‌లో లభిస్తున్న సరసమైన ఎలక్ట్రిక్ కార్లు.. వాటి వివరాలు

రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే చాలా వాహనాలు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇకపైనా కూడా మరిన్ని అధునాతన బైకులు దేశీయ మార్కెట్లో విడుదలవుతాయి. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వినియోగంలో ఉంటాయి, అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Most affordable electric cars in india tigor ev nexon ev kona electric details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X