Just In
- 24 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 35 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 43 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
రోడ్డు భద్రతా నియమాలను అనుసరించి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను తెలుసుకుని ఉండాలి. ట్రాఫిక్ నియమాలను తెలుసుకున్నప్పుడే వాహనాలను ఎటువంటి రహదారిలో ఏ విధంగా వాహనాన్ని నడపాలని అవగాహన ఉంటుంది. కానీ నిజానికి ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న 95% మందికి ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియదు.

వాహనదారులలో 50% మందికి రహదారి భద్రత గురించి కూడా తెలియదు. రోడ్డు భద్రతకు సంబంధించి కార్ డ్రైవర్లను ఫోర్డ్ ఇండియా సర్వే చేసింది. బెంగళూరు, ఢిల్లీతో సహా ఆరు నగరాలకు చెందిన మొత్తం ఆరుగురు కార్ డ్రైవర్లను ఈ సర్వేలో చేర్చారు. బెంగళూరు, ఢిల్లీ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన ఉండగా, కోల్‌కతా, చెన్నై డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై మరింత అవగాహన ఉన్నట్లు తెలిసింది.

ఆటో ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఫోర్డ్ ఇండియా ఆరు నగరాల్లో 1,561 కార్ డ్రైవర్లను సర్వే చేసింది. ఈ డ్రైవర్లకు డ్రైవింగ్ పరీక్ష సమయంలో అడిగే 31 ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలకు 60 శాతం సరైన సమాధానాలు ఇచ్చే వారికి రవాణా కార్యాలయం నుండి డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తారు.
MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

సర్వే చేసిన 97% డ్రైవర్లు తాము డ్రైవింగ్ చేస్తే పరధ్యానంలో ఉంటామని చెప్పారు. ఎక్కువమంది డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగటానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. వాహనాదాలు వాహనాలను వేగంగా డ్రైవ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది.

వాహనదారులు వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు ఢిల్లీ కారు డ్రైవర్లు చెబుతుండగా, 70% కోల్‌కతా వాసులు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా కలకత్తా వాసులు 65% కారు డ్రైవర్లు కొన్నిసార్లు రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేస్తారని చెప్పారు.
MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఢిల్లీ నగరంలో దాదాపు 70 శాతం మంది వాహనదారులు సిగ్నల్ లైట్లను పాటించడం లేదని తెలిపారు. ఢిల్లీ కారు డ్రైవర్లు టర్న్ ఇండికేటర్లను ఉపయోగించరు మరియు లేన్లను మార్చడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా తెలిసింది. ఢిల్లీలో 70% డ్రైవర్లు కారును అధికారిక పార్కింగ్ స్థలంలో పార్క్ చేయరని కూడా చెప్పారు.

ఢిల్లీలో చాలా మంది కార్ డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కారుపై కంట్రోల్ కోల్పోతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది వంటి అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వడంలేదని కూడా తెలిసింది. ముంబై కారు డ్రైవర్లకు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై మిశ్రమ అవగాహన ఉంది. చెన్నై కారు డ్రైవర్లకు రహదారి భద్రత మరియు నియమాలపై మంచి అవగాహన ఉందని సర్వే తెలిపింది.
MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా రోడ్డు నియమాలను ట్రాఫక్ నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే కొంతవరకు ప్రమాదాల భారీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ నియమాలను పాటించడం వాహనదారునికి చాలా వరకు సురక్షితం. వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.