కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

భారతీయ మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కొనుగోలుదారులు కూడా చాలా వారికు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్న వానలను కొనువులుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా వాహనాల్లో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ తప్పనిసరి చేసింది. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికి కూడా కొన్ని ప్రధాన ఫీచర్లను అందించడం లేదు. కానీ కొనుగోలుదారులు కారుని కొనేముందు తప్పకుండా కొన్ని ఫీచర్స్ ఉండేలా చూసుకోవాలి.

ఇప్పుడు మనం ఈ కథనంలో అన్ని కార్లలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

Dead Pedal (డెడ్ ఫెడల్):

డెడ్ ఫెడల్ అనేది కారులో ఒక రకమైన ఫుట్ రెస్ట్. డెడ్ పెడల్స్ పెడల్స్ యొక్క ఎడమ వైపున అందించబడతాయి. కారులో ఇది ముఖ్యమైన ఫీచర్. కారు డ్రైవర్లు ఎక్కువ సమయం కారుని పార్కింగ్ చేయవలసి వచ్చినప్పుడు వారి ఎడమ కాలును ఇక్కడ ఉంచవచ్చు.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

డెడ్ ఫెడల్ అనే ఫీచర్ మాన్యువల్ కార్లలో అందించడం అవసరం. దీనివల్ల కారు డ్రైవర్లు సుదూర ప్రాంతాలలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు క్లచ్ యొక్క దీర్ఘాయువుకు డెడ్ ఫెడల్ చాలా అవసరం. డెడ్ ఫెడల్ అనేది కారులో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ లో ఒకటి.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

Wireless Charging (వైర్‌లెస్ ఛార్జింగ్):

ఇప్పుడు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ అనేది సర్వసాధారణమైపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు అన్ని కార్లలో ఛార్జింగ్ సాకెట్లు అందించబడుతున్నాయి. కానీ వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం కొత్త టెక్నాలజీలకు వేగంగా మారాలి. వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జర్ అనేది పరికరాలను ఛార్జ్ చేసే సౌలభ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన ఫీచర్.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

Rear Defoggers (రియర్ డిఫాగర్):

ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలో కూడా ఈ ఫ్రంట్ డిఫాగర్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కానీ అన్ని కార్లలో రియర్ డిఫాగర్ ఉండదు. రియర్ డిఫాగర్ అనేది కూడా చాలా ముఖ్యమైన ఫీచర్, ఇది రియర్ గ్లాస్ పై పేరుకుపోయిన మంచు మరియు వర్షపు నీటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా అవసరమైన ఫీచర్.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

Rear Parking Camera (రియర్ పార్కింగ్ కెమెరా):

రియర్ పార్కింగ్ కెమెరా అనేది చాలా ముఖ్యమైన ఫీచర్. ఈ రియర్ పార్కింగ్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం భారతదేశంలో కార్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న కార్ల సంఖ్య, పార్కింగ్ స్థలాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా కార్లలో రియర్ పార్కింగ్ కెమెరా అనేది అందుబాటులో ఉంది. ఇంకా కొన్ని కంపెనీలు ఈ రియర్ పార్కింగ్ కెమెరా అందించడం లేదు, కావున అన్ని కార్ల తయారీదారులు తమ అన్ని కార్లలో రియర్ పార్కింగ్ కెమెరాలను అందిస్తే చాలా మంచిది.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

Cruise Control (క్రూయిజ్ కంట్రోల్):

క్రూయిజ్ కంట్రోల్ అనేది కారులోని అద్భుతమైన ఫీచర్, ఇది సుదీర్ఘ ప్రయాణాలలో డ్రైవర్ అలసిపోకుండా కాపాడుతుంది. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉంటే, డ్రైవర్ నిర్దిష్ట వేగాన్ని నిర్వచించడం ద్వారా అలసట లేకుండా ప్రయాణించవచ్చు. అన్ని కార్లు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ని కలిగి ఉంటాయి.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

Tire Pressure Monitoring System (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్):

కారు డ్రైవింగ్ చేసేస్ ప్రతి ఒక్కరూ కూడా కారులో సరైన స్థాయిలో గాలి ఉందా, లేదా అని టెస్ట్ చేస్తూ ఉండాలి. కానీ చాలా మంది పని ఒత్తిడిలో పది అవన్నీ కూడా మరిచిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో కారులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

కారు టైర్ సురక్షితం కాకపోతే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇప్పుడు చాలా కార్లలో అందించబడుతుంది. అయితే ఈ ఫీచర్ అన్ని కార్లలో అందుబాటులో ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా ఒక ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

పైన పేర్కొన్న అన్ని ఫీచర్స్ కారులో అందిస్తే, ఆ కారు ధర పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇవన్నీ కూడా వాహనదారుని భద్రతను నిర్ధరిస్తాయి. అంతే కాకుండా ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిన ఫీచర్స్. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కార్లన్నీ కూడా మనం ఇదివరకే చెప్పుకున్నట్లు చాలా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. అయితే త్వరలో పైన పేర్కొన్న అన్ని ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఆశిస్తున్నాము.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, కొత్తగా విడుదల చేసిన అన్ని కార్లలో తప్పకుండా ఎయిర్ బ్యాగ్స్ అందించాలి. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. అదనంగా, వాహనాలను అతి వేగంగా నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది.

కొత్త కారు కొంటున్నారా.. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయో, లేదో చూడండి; ఎందుకంటే?

రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, విడుదలయ్యే అన్ని కొత్త కార్లలో భద్రతా ఫీచర్లను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీదారులను ఆదేశించింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంచి రోడ్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. వాహనదారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే ఈ రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిలువరించవచ్చు.

Most Read Articles

English summary
Most important features needed in new cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X