బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారు పేరు 'హవల్ హెచ్6'. బ్యాంకాక్‌లో జరుగుతున్న 42వ అంతర్జాతీయ మోటార్ షోలో చైనాకి చెందిన గ్రేట్ వాల్ మోటార్ (జిడబ్ల్యూఎమ్) కంపెనీ ఈ కారుకి గ్లోబల్ ప్రీమియర్ నిర్వహించింది. హవల్ హెచ్6 ఎస్‌యూవీ ఒక హైబ్రిడ్ కారు.

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

హవల్ హెచ్6 మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఇది ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదల కానుంది. అక్కడి మార్కెట్లో దీని ప్రారంభ ధర 30,990 ఆస్ట్రేలియన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.17 లక్షలు (ఎక్స్-షోరూమ్).

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

హవల్ హెచ్6 హైబ్రిడ్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సెవన్-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 150 కిలోవాట్ పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

ఈ కారులోని స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌లో భాగంగా 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ మరియు 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్సింగ్ కెమెరా మరియు ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు రియర్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

ఇందులోని స్టాండర్డ్ సేఫ్టీ మరియు డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను గమనిస్తే, రోడ్డుపై పాదచారులను మరియు సైక్లిస్ట్‌లను గుర్తించి ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే అత్యవసర బ్రేకింగ్, లేన్-చేంజింగ్ అలెర్ట్, లేన్-కీప్ అసిస్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, డ్రైవర్ ఫెటీగ్ మానిటరింగ్, ట్రాఫిక్-సైన్ రికగ్నిషన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మోనటరింగ్ మరియు ఏడు ఎయిర్‌బ్యాగులు మొదలైనవి ఉన్నాయి.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

మిడ్-లెవల్ వేరియంట్లలో హీటెడ్ సీట్స్, సిక్స్ వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ యాంటీ గ్లేర్ రియర్-వ్యూ మిర్రర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఎనిమిది-స్పీకర్ల డిటిఎస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఎల్‌ఇడి ఫ్రంట్ ఫాగ్ లైట్లు, రూఫ్ రైల్స్ మరియు స్టాప్-అండ్-గోతో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్-జామ్ అసిస్ట్, ఇంటెలిజెంట్ క్రూయిజ్ అసిస్ట్‌ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

టాప్-ఎండ్ వేరియంట్లలో 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పెద్ద 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, అడ్జస్టబల్ ప్యాసింజర్ సీటు, ఫుల్లీ ఆటోమేటిక్ పార్కింగ్ మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అధునాత ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

బ్యాంకాక్‌లో 'హవల్ హెచ్6' ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా?

హవల్ హెచ్ 6 4653 మిమీ పొడవు, 1886 మిమీ వెడల్పు మరియు 1724 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2738 మిమీగా ఉంటుంది.

ఎమ్‌జి మోటార్స్ కంటే ముందుగానే గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ భారత మార్కెట్లోకి ప్రవేశించాలని ప్లాన్ చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ చైనీస్ కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించలేకపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమనే వాదనలు కూడా ఉన్నాయి. మరి భవిష్యత్తులోనైనా ఈ కార్ బ్రాండ్ ఇక్కడి వస్తుందో లేదో వేచి చూడాలి.

Most Read Articles

English summary
New 2021 Haval H6 SUV Unveiled At 42nd BIMS. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X