కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

జపనీస్ కార్ బ్రాండ్ Honda ఇటీవలే తమ సరికొత్త 2021 Amaze కాంపాక్ట్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ కారు కోసం కంపెనీ అధికారిక యాక్ససరీలను విడుదల చేసింది. ఆ వివరాలంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

ఆగస్ట్ 18న కంపెనీ తమ కొత్త 2021 Honda Amaze ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ. 6.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 11.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

ఈ కొత్త 2021 Honda Amaze కారును కొనుగోలు చేసిన కస్టమర్లు, తమ కారు యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ భాగాలకు అదనపు ఫీచర్లను జోడించాలని చూస్తున్నట్లయితే, వారి కోసం కంపెనీ అనేక ఉపకరణాలను (యాక్ససరీలను) అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు వీటిని కంపెనీ అధికారిక డీలర్‌షిప్ ల నుండి కొనుగోలు చేయవచ్చు.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

కొత్త 2021 Honda Amaze ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం కంపెనీ అందిస్తున్న యాక్ససరీస్ లో కారు యొక్క ఎక్స్టీరియర్ అందాన్ని మరింత పెంచడం కోసం క్రోమ్ హైలైట్‌లు ఇవ్వబడ్డాయి. ఈ క్రోమ్ యాక్సెంట్‌లను సైడ్ మిర్రరలు, టెయిల్ లైట్స్, ట్రంక్, డోర్ వైజర్, విండో లైన్ మరియు డోర్ క్రింది భాగంలో అప్లై చేయవచ్చు.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

వీటితో పాటుగా, వినియోగదారులు ఆకర్షణీయమైన ట్రంక్ స్పాయిలర్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇంకా వీటిలో బాడీ సైడ్ మౌల్డింగ్, డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్, మడ్ ఫ్లాప్స్ మరియు బంపర్ ప్రొటెక్టర్ యాక్ససరీలు కూడా ఉన్నాయి. అలాగే, ఇంటీరియర్‌ని ఆకర్షణీయంగా చేయడం కోసం బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్‌కు సరిపోయేలా ఆరు రకాల సీటు కవర్ ఆప్షన్లు మరియు మూడు రకాల ఫ్లోర్ మ్యాట్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

అంతేకాకుండా, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, ఫుట్‌వెల్ లైటింగ్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్స్ మరియు రివర్స్ కెమెరా మరియు డిస్‌ప్లేతో కూడిన ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కిట్ మొదలైనవి ఉన్నాయి. ఈ యాక్ససరీలను వ్యక్తిగతంగా కాకుండా, ప్యాకేజీ రూపంలో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కంపెనీ ఆప్షన్లను అందిస్తోంది.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

కొత్త అమేజ్ సెడాన్ కోసం ఈ ఉపకరణాలను సులభంగా ఎంచుకోవడానికి Honda బేసిక్ కిట్, క్రోమ్ ప్యాకేజ్ మరియు యుటిలిటీ ప్యాకేజ్ అనే ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ యాక్ససరీ ధరలు తెలుసుకోవడానికి మరియు వాటిని సరిగ్గా ఇన్‌స్టాల్ చేయడానికి, మీరు అధికారిక Honda డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

ఈ కొత్త 2021 Honda Amaze 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 110 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

ఇకపోతే, ఇందులోని డీజిల్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది. అలాగే, ఇందులో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో కూడిన డీజిల్ ఇంజన్ వేరియంట్ గరిష్టంగా 79 బిహెచ్‌పి పవర్ ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

కొత్త 2021 Amaze మోడల్ లో చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు మినహా యాంత్రికంగా మరియు ఫీచర్ల పరంగా కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి వెర్షన్‌లో లభించిన అన్ని ఫీచర్లు ఈ కొత్త కారులో కూడా లభ్యం కానున్నాయి. ఈ మోడల్ ప్పుడు మెటోరాయిడ్ గ్రే, ప్లాటినం పెరల్ వైట్, లూనార్ సిల్వర్, గోల్డెన్ బ్రౌన్ మరియు రేడియంట్ రెడ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

ఇందులో చేసిన ఇతర అప్‌గ్రేడ్‌లను పరిశీలిస్తే, డాష్‌బోర్డ్‌లో శాటిన్ సిల్వర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఇవి కారు క్యాబిన్ ఫీల్‌ను మెరుగుపరుస్తాయి. ఇంకా ఇందులో క్లైమేట్ కంట్రోల్, హోండా స్మార్ట్ కీ పుష్-బటన్ స్టార్ట్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2021 Honda Amaze ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో గైడ్‌లైన్స్‌తో కూడిన మల్టీ వ్యూ రియర్ పార్కింగ్ కెమెరాను కొత్తగా జోడించారు. అలాగే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు.

కొత్త 2021 Amaze యాక్ససరీస్.. వీటితో మరింత అందంగా మరియు సౌకర్యవంతంగా..

కొత్త 2021 Honda Amaze మూడు వేరియంట్లు మరియు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మరియు రెండు గేర్‌బాక్స్‌ల ఆప్షన్లతో విడుదల చేయబడింది. ఇటీవల మేము ఈ కొత్త 2021 Honda Amaze యొక్క పెట్రోల్ వేరియంట్‌ను టెస్ట్ డ్రైవ్ చేశాము. - దీని ఇంజన్, డ్రైవింగ్ అనుభవం, మైలేజ్ మొదలైన వాటి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New 2021 honda amaze facelift accessories list revealed details
Story first published: Thursday, August 26, 2021, 13:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X