Just In
- 52 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Movies
రిలీజ్‌కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెస్టింగ్ దశలో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ300; స్పై చిత్రాలు
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్ కోసం 2021వ సంవత్సరంలో అనేక కొత్త మోడళ్లను ప్లాన్ చేస్తోంది. ఇందులో కొత్త తరం స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 మోడళ్లు ఉన్న సంగతి తెలిసినదే.

తాజా సమాచారం ప్రకారం, మహీంద్రా విక్రయిస్తున్న ఎక్స్‌యూవీ300లో కూడా కంపెనీ ఓ సరికొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

ఈ స్పై చిత్రాలలో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీని పాక్షికంగా క్యామోఫ్లేజ్ చేసి ఉండటాన్ని గమనిస్తే, ఇది ఉత్పత్తి సిద్ధంగా ఉన్న మోడల్‌గా తెలుస్తోంది. ఇది గతేడాది 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ప్రదర్శించిన స్పోర్ట్ వేరియంట్ ఎక్స్‌యూవీ300 కావచ్చని భావిస్తున్నారు.
MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించిన స్పోర్ట్స్ వేరియంట్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌కి ఆ సమయంలో మంచి ఆదరణ లభించింది. వాస్తవానికి గతేడాదే ఈ మోడల్ మార్కెట్లోకి రావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వలన దీని విడుదల మరింత ఆలస్యమైంది.

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, స్టాండర్డ్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 మోడల్‌కి ఈ కొత్త మోడల్‌కి డిజైన్ పరంగా పెద్ద తేడాలేమీ కనిపించడం లేదు. పేరుకు తగినట్లుగా, ఈ స్పోర్ట్స్ వేరియంట్‌కు స్పోర్టీ రూపాన్నిచ్చేందుకు గానూ కంపెనీ ఇందులో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసే అకాశం ఉంది.
MOST READ:పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం

ఇందులో బ్లాక్ కలర్ రియర్ బంపర్, బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లపై సిల్వర్ స్కఫ్ ప్లేట్స్ వంటి మార్పులను ఇందులో ఆశించవచ్చు. ఇందులో స్పోర్టీ వేరియంట్‌ను హైలైట్ చేసేందుకు స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ మరియు బ్రేక్ కాలిపర్‌లపై రెడ్ డీటేలింగ్స్ ఉండొచ్చు.

స్పోర్టీ రూఫ్ రెయిల్స్, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్, బ్లాకవుట్ పిల్లర్స్, ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్స్ చుట్టూ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్, 17 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
MOST READ:ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

ఈ కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ300లో కంపెనీ ఈ స్పోర్టీ థీమ్‌ను ఇంటీరియర్స్‌లో కూడా క్యారీ చేయనుంది. దీని డాష్‌బోర్డ్‌లో రెడ్ కలర్ డీటేలింగ్స్, సీట్లపై రెడ్ కలర్ స్టిచింగ్ వంటి మార్పులను ఆశించవచ్చు. దీని క్యాబిన్ మొత్తాన్ని బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంచనున్నారు. ఫీచర్ల పరంగా దీనిని టాప్-ఎండ్ డబ్ల్యూ8 (ఓ) వేరియంట్ మాదిరిగా ఆఫర్ చేయనున్నారు.

ఈ వేరియంట్‌లో అతిపెద్ద మార్పు ఇంజన్ రూపంలో ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ జిడిఐ ఎమ్‌స్టాలియన్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 230 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ గణాంకాలతో ఇది ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన మరియు అత్యధిక టార్క్‌ను విడుదల చేసే కారుగా మారుతుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ పవర్, టార్క్‌లకు అనుగుణంగా కంపెనీ దీని సస్పెన్షన్ సెటప్‌లో కూడా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఇది మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.
Image Courtesy: yt_talesofmiles