సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

మారుతి సుజుకి ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ రాక మరికొంత ఆలస్యమైంది. వాస్తవానికి, ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత మార్కెట్లో విడుదల కావల్సిన కొత్త సెలెరియో, కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

అయితే, ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి ఇప్పుడు ఈ కారును సెప్టెంబరులో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త సెలెరియో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా మరింత శుద్ధి చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుందని సమాచారం.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియోను కంపెనీ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఇది హియర్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు అప్‌డేటెడ్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. పాత తరం మోడల్ కంటే, ఇది మరింత పెద్దదిగా ఉంటుందని ఇటీవల లీకైన చిత్రాలను చూస్తుంటే స్పష్టమవుతోంది.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

ఈ కారులో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు మరియు బంపర్‌లతో రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా కలిగి ఉంటుంది. మొదటి తరం మారుతి సెలెరియోతో పోలిస్తే, కొత్తగా రాబోయే రెండవ-తరం సెలెరియో ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా, ఈ కొత్త కారులో మునుపటి కన్నా మరింత మెరుగైన క్యాబిన్ స్థలం ఉంటుంది.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

ఈ కొత్త తరం హ్యాచ్‌బ్యాక్ లోపల మరియు వెలుపల పూర్తి రీడిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎక్స్టీరియర్ మార్పులలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో రీడిజైన్ చేయబడిన బంపర్‌లు మొదలైన మార్పులను ఆశించవచ్చు.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

ఇంటీరియర్ మార్పుల విషయానికి వస్తే, ఇందులో క్యాబిన్ లేఅవుట్‌ని పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని పెద్ద 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి శక్తిని మరియు వద్ద 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

ఈ ఇంజన్లన్నీ కూడా ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ సెకండ్ జనరేషన్ సెలెరియోలోని లోయర్-స్పెక్ 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లలో కూడా కంపెనీ పెట్రోల్-సిఎన్‌జి వేరియంట్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.

సెప్టెంబర్‌లో కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో విడుదల!

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. ఇది ఈ విభాగంలో టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో మరియు రెనో క్విడ్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
New 2021 Maruti Suzuki Celerio Hatchback Launch Expected In September, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X