కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి లేటెస్ట్ గా వచ్చిన కొత్త తరం 2021 సెలెరియో (2021 Celerio), మార్కెట్లో మొత్తం నాలుగు ట్రిమ్ లుగా విడుదల చేయబడింది. వీటిని ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆధారంగా LXi, VXi MT, VXi AMT, ZXi MT, ZXi AMT, ZXi+ MT మరియు ZXi+ AMT అనే 7 వేరియంట్లు విభజించారు. వీటిలో Celerio LXi అనేది బేస్ వేరియంట్. మార్కెట్లో దీని ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో ఎల్ఎక్స్ఐ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. మరి ఈ బేస్ వేరియంట్ (ఎల్‌ఎక్స్‌ఐ) ధర, ఫీచర్లు, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వివరాలు, ఇంజన్, కంఫర్ట్ మరియు సేఫ్టీ పీచర్లు, మైలేజ్ మొదలైన వాటి గురించిన మొత్తం సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

2021 Celerio LXi - ధర

కొత్త మారుతి సుజుకి సెలెరియో ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌టి/ఏజిఎస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. మార్కెట్లో కొత్త సెలెరియో ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

2021 Celerio LXi - ఫీచర్లు

 • బాడీ కలర్ బంపర్స్
 • ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ యాక్సెంట్స్
 • సైడ్ సన్ వైజర్
 • 6 పొజిషన్ బాటిల్ హోల్డర్
 • ఫ్రంట్ సీట్ పాకెట్
 • ఫ్రంట్ అండ్ రియర్ సీట్ హెడ్‌రెస్ట్‌లు
 • ఎయిర్ కండీషనర్
 • పవర్ స్టీరింగ్
 • యాక్ససరీ సాకెట్
 • కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

  2021 Celerio LXi - సేఫ్టీ ఫీచర్లు

  • డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • సీట్ బెల్ట్ రిమైండర్ (డ్రైవర్ + ప్యాసింజర్)
  • పెడస్టేరియన్ సేఫ్టీ
  • ఏబిఎస్
  • సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్
  • హెడ్‌లైట్ లెవలింగ్
  • ఇంజన్ ఇమ్మొబిలైజర్
  • వెనుక తలుపులపై చైల్డ్ ప్రూఫ్ లాక్
  • హై స్పీడ్ అలెర్ట్ సిస్టమ్
  • రివర్స్ పార్కింగ్ సెన్సార్
  • కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

   2021 Celerio LXi - ఇంజన్ మరియు గేర్‌బాక్స్

   కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో కారును ఒకే ఒక పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేశారు. ఈ కారులో అమర్చిన కొత్త 1.0-లీటర్ K10C న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ రిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు AMT (AGS) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో కంపెనీ ఇందులో సిఎన్‌జి వేరియంట్లను కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తుంది.

   కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

   2021 Celerio LXi - మైలేజ్

   మైలేజీ విషయానికొస్తే, కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే చిన్న కారుగా ఉంది. కొత్త సెలెరియో కోసం కంపెనీ క్లెయిమ్ చేయబడిన మైలేజ్ 25.24 kmpl (LXi మాన్యువల్, VXi మాన్యువల్, ZXi మాన్యువల్), 24.97 kmpl (ZXi+ మాన్యువల్‌), 26.68 kmpl (VXi AGS వేరియంట్) మరియు 26 kmpl (ZXi AGS మరియు ZXi+ AGS వేరియంట్లు).

   కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

   కొత్త సెలెరియో కారులో మెరుగైన మైలేజ్ కోసం కంపెనీ ఇందులో ఇంజన్ ఐడి స్టార్ట్ / స్టాప్ (Idle Start-Stop) టెక్నాలజీని ఉపయోగించింది. ఈ కారులో 32 లీటర్ల పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. అంటే, కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ కారును ఫుల్ ట్యాంక్ చేసుకుంటే, సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అన్నమాట.

   కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

   2021 Celerio LXi - కలర్ ఆప్షన్స్

   • ఫైర్ రెడ్
   • స్పీడీ బ్లూ
   • సిల్కీ సిల్వర్
   • గ్లిస్టరింగ్ గ్రే
   • ఆర్కిటిక్ వైట్
   • కెఫిన్ బ్రౌన్
   • కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

    2021 Celerio LXi - వీల్స్, బ్రేక్‌లు, పరిమాణం

    సెలెరియో LXi, VXi, ZXi వేరియంట్లలో 165/70R14 ప్రొఫైల్‌తో కూడిన వీల్స్ మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి ఈ కారు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఈ హ్యాచ్‌బ్యాక్ పొడవు 3695 మిమీ, వెడల్పు 1655 మిమీ, ఎత్తు 1555 మిమీ మరియు దీని వీల్‌బేస్ 2435 మిమీగా ఉంటుంది. ఈ చిన్న కారులో 313 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

    కొత్త 2021 Maruti Celerio LXi బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? ఈ వేరియంట్‌లో ఏమేమి ఉన్నాయ్..?

    మరి 2021 Celerio LXi బేస్ వేరియంట్ ను కొనొచ్చా..?

    ధర పరంగా చూస్తే, కొత్త 2021 సెలెరియో బేస్ వేరియంట్ చాలా సరసమైన ధరను కలిగి ఉంది. అంతేకాకుండా, కంపెనీ ఈ బేస్ వేరియంట్ లో ఒక సాధారణ కారులో అవసరమైన అన్ని రకాల ఫీచర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఈ సరికొత్త సెలెరియో అనేక మార్పులతో తీసుకువచ్చింది మరియు మైలేజ్ పరంగా కూడా ఇది మెరుగ్గా ఉంది. అయితే, ఈ కారులో మరిన్ని కంఫర్ట్ ఫీచర్లను కోరుకునే కస్టమర్లు కాస్తంత ధర ఎక్కువైనా పర్లేదు మిడ్-స్పెక్ VXi వేరియంట్ ను కానీ లేదా టాప్-స్పెక్ ZXi వేరియంట్ ను కానీ ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
New 2021 maruti suzuki celerio lxi base variant price specs features engine and mileage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X