కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

మారుతి సుజుకి తమ కొత్త 2021 మోడల్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను నేడు (ఫిబ్రవరి 24, 2021) మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలు (ఎక్స్‌-షోరూమ్)గా ఉంది. కొత్త స్విఫ్ట్ మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదలచేయబడింది.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

కొత్త స్విఫ్ట్‌లో టాప్ ఎండ్ వేరియంట్ జెడ్‌ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ (ఏఎమ్‌టి) ధర రూ.8.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గడచిన 2017లో కొత్త తరం స్విఫ్ట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత, ఈ మోడల్‌లో మేజర్ అప్‌డేట్‌ను విడుదల చేయటం ఇదే మొదటిసారి.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

ఈ 2021 మోడల్ ఇయర్ స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో చేసిన ఎక్స్టీరియర్ మార్పులను గమనిస్తే, దీని ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డిఎల్ఆర్ఎల్‌తో కూడిన కొత్త ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బోల్డ్ క్రోమ్ యాక్సెంట్స్‌తో కూడిన స్పోర్టీ క్రాస్ మెష్ గ్రిల్, ప్రెసిసన్ కట్ టూ-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వంటి కొత్త మార్పులు ఉన్నాయి.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

ఇంటీరియర్లలో చేసిన మార్పులను గమనిస్తే, ఇందులో కొత్తగా లెథర్‌తో చుట్టబడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌, డ్యాష్‌బోర్డ్ సెంటర్‌లో అమర్చిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వెనుక భాగంలో ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన మల్టీ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు స్పోర్టీ సీట్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Maruti Swift Price (MT) Price (AMT)
LXI ₹5.73 Lakh -
VXI ₹6.36 Lakh ₹6.86 Lakh
ZXI ₹6.99 Lakh ₹7.49 Lakh
ZXI+ ₹7.77 Lakh ₹8.27 Lakh
ZXI+ Dual Tone ₹7.91 Lakh ₹8.41 Lakh
కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

ఇంకా స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ట్రిమ్స్‌పై సిల్వర్ యాక్సెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో సపోర్ట్ మొదలైన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఈఎస్‌పి (ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), కెమెరాతో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

ఇంజన్ పరంగా కొత్త 2021 మోడల్ మారుతి స్విఫ్ట్ కారులో నెక్స్ట్ జనరేషన్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ 12ఎన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటి ఇంజన్ కన్నా ఇది మరింత శక్తివంతమైనది (7 బిహెచ్‌పిల అదనపు శక్తిని అందిస్తుంది).

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఎఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త కారులో మైలేజీని మెరుగుపరచేందుకు గాను ఇంజన్ ఐడల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని ఉపయోగించారు.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 23.20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఏఎమ్‌టి వెర్షన్ లీటరుకు 23.76 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ ఐ10 నియోస్, ఫోర్డ్ ఫిగో మరియు టాటా టియాగో వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.

కేవలం రూ.5.73 లక్షలకే కొత్త 2021 మారుతి స్విఫ్ట్ విడుదల - ఫుల్ డీటేల్స్

కొత్త స్విఫ్ట్ కూడా కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. గతంలో పాత స్విఫ్ట్ ధరలతో (రూ.5.19 - రూ.8.02 లక్షలు) పోల్చుకుంటే, ఈ కొత్త స్విఫ్ట్ ధరలు (రూ.5.73 - రూ.8.41 లక్షలు) అధికంగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 24, 2021, 13:25 [IST]
English summary
New 2021 Maruti Suzuki Swift Facelift Launched In India; Price, Specs And Feature. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+